పవన్, మహేష్ కంటే ఆ కుర్రాళ్లే బెటర్

Update: 2016-09-30 12:27 GMT
దర్శకరత్న దాసరి నారాయణరావు స్టార్ హీరోల మీద కౌంటర్లు వేయడం కొత్తేమీ కాదు. తరచుగా ఇలాంటివి చేస్తూనే ఉండే ఆయన.. ఎప్పటికప్పుడు ఓ కొత్త కాన్సెప్ట్ తో దిగిపోతుంటారు. టాపిక్ ఎటు నుంచి ఎటు తిప్పినా.. ఎక్కడి నుంచి ఇంకెక్కడికొచ్చినా.. పాయింట్ మాత్రం అక్కడికే తీసుకురావడంలో ఆయన సంథింగ్ స్పెషల్ అంతే.

ఓ ఆడియో ఫంక్షన్ కి అటెండ్ అయిన ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. 'టాలీవుడ్ లో బడా నిర్మాతలు కూడా తమిళ్ సినిమాల ముహూర్తం రోజనే చెన్నైలో వాలిపోయి భారీ మొత్తానికి చెక్కులు చేతిలో పెట్టేస్తున్నారు. రిలీజ్ సమయానికి కోటి నుంచి 38 కోట్లు చెల్లించి తమిళ సినిమాల హక్కులు దక్కించుకుంటున్నారు. ఓ లాంఛింగ్ హీరో సినిమాకి కూడా కనీసం కోటి రూపాయలు ముట్టచెప్పేస్తున్నారు. మహేష్.. పవన్.. చరణ్.. ఎన్టీఆర్.. ప్రభాస్ లాంటి పెద్ద హీరోల సినిమాలకు కూడా తమిళ్ డబ్బింగ్ రైట్స్ గా 50 లక్షలు రావడం లేదు' అన్నారు దాసరి.

ఈ మధ్య తమిళ్ డబ్బింగ్ సినిమాల ఆడియో ఫంక్షన్స్ కి అటెండ్ అవడం మానేశానని.. తెలుగు సినిమాపై ప్రభావం చూపించే ఈ ట్రెండ్ లో తాను భాగం కాదలచుకోలేదని అంటున్నారు దాసరి. ముఖ్యంగా ఈ ట్రెండ్ కారణంగా.. చిన్న సినిమాలపై పెద్ద దెబ్బ పడుతోందన్నది దాసరి అంటున్నారు.
Tags:    

Similar News