క్యూరియాసిటీ పెంచుతున్న ఏషియ‌న్ నారంగ్ పాన్ ఇండియా మూవీ!

Update: 2021-08-26 14:43 GMT
కుర్చీ కోసం సింహాసనం కోసం కొట్లాడుకున్న చ‌రిత్ర ఎంతో ఘ‌నంగా లిఖిత‌మై ఉంది. భార‌తదేశ చ‌రిత్ర‌లో ఇలాంటి క‌థ‌లు ఎన్నో ఉన్నాయి. రాజులు రాజ్యాలు పోయినా  రాచ‌రికంలో కుర్చీలాట హిస్ట‌రీగా మారి ప్ర‌జ‌లు క‌థ‌లు క‌థ‌లు గా చెప్పుకునేంత‌గా ఉంది. అంతెందుకు బాహుబ‌లి క‌థ కూడా అన్న‌ద‌మ్ముల మ‌ధ్య కుర్చీ కోసం కొట్లాట నేప‌థ్య‌మే. ఇంత‌కుముందు క‌ర‌ణ్ జోహార్ త‌క్త్ అనే సినిమాని ప్ర‌క‌టించారు. సింహాస‌నం కోసం కొట్లాడుకునే అన్న‌ద‌మ్ముల క‌థ‌తో ఈ సినిమాని తెర‌కెక్కిస్తార‌ని తెలిసినా అది ఇంకా సెట్స్ కెళ్ల‌లేదు.

అదంతా స‌రే కానీ.. ఇటీవ‌ల వ‌రుస సినిమాల నిర్మాణంతో ఏషియ‌న్ నారంగ్ సంచ‌ల‌నాల‌కు రెడీ అవుతున్నారు.  27 ఆగ‌స్టు బ‌ర్త్ డేని పుర‌స్క‌రించుకుని త‌దుప‌రి అప్ డేట్ ని అందించేందుకు నారంగ్ బృందం సిద్ధ‌మ‌వుతోంది. తాజాగా ఎగ్జయిటింగ్ ఎనౌన్స్ మెంట్ కి సిద్ధ‌మ‌వుతున్నాం అంటూ ప్రీలుక్ ని రిలీజ్ చేశారు. ఈ శుక్ర‌వారం ఉద‌యం 10.25 గం.ల‌కు సినిమాని ప్ర‌క‌టిస్తామ‌ని వెల్ల‌డించారు. శ్రీ‌వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ ఎల్.పి- ఏషియ‌న్ సినిమాస్ - క‌ర‌ణ్ సి ప్రొడ‌క్ష‌న్స్ ఎల్.ఎల్.పి సంయుక్తంగా నిర్మించే ఈ సినిమా వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది. తెలుగు-త‌మిళం-హిందీ- క‌న్న‌డ -మ‌ల‌యాళం లో ఈ సినిమా అత్యంత భారీగా విడుద‌ల కానుంద‌ని పోస్ట‌ర్ లో వెల్ల‌డించారు.

ఇక ఈ పోస్ట‌ర్ లో సింహాస‌నం లేదా కుర్చీ ర‌క్త‌సిక్త‌మై క‌నిపిస్తోంది. అంటే అక్క‌డ హ‌త్య జ‌రిగింది. కుర్చీ కోసం కొట్లాట అన్న అర్థం క‌నిపిస్తోంది. పోస్ట‌ర్ తోనే ఆద్యంతం క్యూరియాసిటీని పెంచారు. ఇది హిస్ట‌రీ నేప‌థ్యంలోని సినిమా అని అర్థ‌మ‌వుతోంది. ఇంత‌కుముందే శేఖ‌ర్ క‌మ్ముల‌- ధ‌నుష్ సినిమాని ప్ర‌క‌టించారు. మ‌ద్రాస్ పాల‌న‌ నేప‌థ్యంలో సాగే చిత్ర‌మిద‌ని ప్ర‌చార‌మైంది. అయితే అన్ని విష‌యాల్ని నారంగ్ రేపు ఉద‌యం అధికారికంగా వెల్ల‌డిస్తారేమో చూడాలి.
Tags:    

Similar News