రానా సినిమాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్
ప్రముఖ లంక క్రికెటర్ ముత్తయ్య మురళిధరన్ బయోపిక్ కు ఏర్పాట్లు జరుగుతున్న విషయం తెల్సిందే. ముత్తయ్య మురళిధరన్ పాత్రను తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి పోషించబోతున్నాడు. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ లో రానా నిర్మించబోతున్నాడు. అందుకోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ డీఏఆర్ మోషన్ పిక్చర్స్ ప్రొడక్షన్స్ తో కలిసి రానా ఈ చిత్రంను నిర్మిస్తున్నాడు.
తాజాగా డీఏఆర్ మోషన్ పిక్చర్స్ అధినేత సేథు మాధవన్ ఈ చిత్రం గురించి ఆసక్తికర విషయాలను వెళ్లడించారు. ఈ బయోపిక్ లో ఒక కీలక పాత్రను ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పోషించబోతున్నట్లుగా తెలుస్తోంది. సచిన్ తన సొంత పాత్రను పోషించే అవకాశం ఉంది. ఇక ముత్తయ్య మురళిధరన్ భార్య కూడా ఈ బయోపిక్ లో కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
'800' టైటిల్ ఈ చిత్రం కోసం పరిశీలిస్తున్నారు. వచ్చే ఏడాదిలోనే ఈ చిత్రం విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో ప్రముఖ తారలు మరియు క్రికెటర్లతో ఈ చిత్రంను ప్లాన్ చేస్తున్నారు. రానా ఈ చిత్రం నిర్మాణంలో ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.