బాహుబలి2.. హైప్ మరీ ఎక్కువైందట

Update: 2017-04-27 07:05 GMT
బాహుబలి ది కంక్లూజన్ మూవీ విపరీతమైన అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చేస్తోంది. రేపు రిలీజ్ కావాల్సిన సినిమాను.. ఇవాళ సెకండ్ షోల నుంచే ప్రదర్శించేస్తున్నారు. అంటే కొన్ని గంటల్లోనే బాహుబలి2 ఏం చేయబోతున్నాడనే విషయం తెలిసిపోతుంది.

ఈ మూవీలో అనేక హైలైట్స్ ఉన్నాయని తెలుస్తోంది. మూవీని సెన్సార్ చేసిన మెంబర్లు.. బాహుబలి2 గురించిన ఆసక్తికరమైన సంగతులు చెప్పిందంటూ.. ప్రముఖ ఇంగ్లీష్ డైలీ డెక్కన్ క్రానికల్ లో ఆర్టికల్ ప్రచురించారు. బాహుబలి కంటే అన్ని విధాలా చాలా గ్రాండ్ ఉంటుందని సెన్సార్ సభ్యులు చెప్పారన్నది ఈ ఆర్టికల్ సారాంశం. అలాగే కట్టప్ప సీక్రెట్ కూడా ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయమని అన్నారట. అలాగే 100 అడుగుల విగ్రహాన్ని ఇన్ స్టాల్ చేసే సీన్ అద్భుతంగా ఉందని చెబుతున్న వీరు.. మొత్తంగా సినిమాకు పర్లేదంతే అనేశారని రాయడం ఆశ్చర్యకరమైన విషయం. బాహుబలి ది బిగినింగ్ అనుకోకుండా ఆ స్థాయి విజయం సాధించడంతో.. రెండో మూవీ విషయంలో హైప్ క్రియేట్ చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారని చెబుతున్నారు. అయితే అవసరం అయినదాని కంటే హైప్ ఎక్కువగా ఉందని సెన్సార్ సభ్యులు చెప్పినట్లుగా ఈ పత్రిక తెలిపింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News