జక్కన్న పేరుతో టైటిల్ వినిపిస్తే చాలు
ఎస్.ఎస్.రాజమౌళి (జక్కన్న)... ఈ పేరే ఓ బ్రాండ్. అందుకే అతడి నోటినుంచి ఏదైనా టైటిల్ వినిపించింది అంటే అది వెంటనే జనాల మైండ్ లో రిజిష్టర్ అయిపోవాల్సిందే. అప్పట్లో బాహుబలి అన్న టైటిల్ ని నామమాత్రంగానే పెట్టుకున్నాడు. సినిమా షూటింగులో ఉండగా ఆ టైటిల్ ని కేవలం వర్కింగ్ టైటిల్ అనే అనుకున్నాడు. కానీ జనాల నోళ్లలో అది బాగా నానిపోయింది. చివరికి ఆ టైటిల్ నే ఫైనల్ చేయాల్సొచ్చేంత ఒత్తిడి అతడికి ఎదురైంది. అలా బాహుబలి అన్న టైటిల్ ఇప్పుడు వరల్డ్ వైడ్ పాపులర్ అయిపోయింది.
ఇక రాజమౌళి దర్శకత్వంలో గరుడ అనే టైటిల్ తో సినిమా తెరకెక్కుతోంది అంటూ ఇటీవలి కాలంలో ప్రచారమైంది. కానీ ఆ టైటిల్ తో విక్రమ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కేస్తోంది. తాజాగా గరుడ టైటిల్ మళ్ళీ వెలుగులోకొచ్చి౦ది. తమిళ౦లో విక్రమ్ హీరోగా తిరు ఓ సినిమాను రూపొ౦ది౦చబోతున్నాడు. ఈ సినిమాకు గరుడ టైటిల్ ను ఖరారు చేయడ౦ చర్ఛనీయా౦శ౦గా మారి౦ది.
అంటే రాజమౌళి పేరుతో లింకప్ అయ్యి ఏ టైటిల్ వినిపించినా అది అన్నిచోట్లా ఫేమస్ అయిపోతోంది. ఇప్పుడు అతడి నోటినుంచి ఏదైనా కొత్త టైటిల్ వినిపిస్తే అది కూడా అలానే పాపులర్ అయిపోతుందని అర్థమవుతోంది. గరుత్మంతుడు - ఘటోత్కచుడు - విశ్వామిత్రుడు ఇలా ఆయన నోటినుంచి ఏ టైటిల్ వచ్చినా అది ముందుగా జనాల్లోకి దూసుకుపోతుంది. ఆ తర్వాత ఆ టైటిల్ తోనే రాజమౌళి కానీ వేరే దర్శకులు కానీ సినిమాలు తీసి ఈజీగా ప్రచారం కొట్టేయొచ్చు. హిట్లు కొట్టేయొచ్చు. జనాల మైండ్ లోకి టైటిల్ రిజిష్టర్ అయిపోతుంది కాబట్టి నో రీథింకింగ్ అనుకోవచ్చు. అయితే ఇలాంటి బ్రాండింగ్ వేరే దర్శకులకు ఇప్పట్లో సాధ్యం కానేకాదేమో!