• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నితిన్ సినిమా...

నితిన్ సినిమా వచ్చేస్తోంది సెప్టెంబరు 11న

By - Tupaki Desk
Update: 2015-08-15 13:42 GMT
ఏంటో కొన్ని సినిమాలు ఎందుకు ఆగిపోతాయో... సడెన్ గా ఉన్నట్లుండి ఎలా రిలీజైపోతాయో అర్థమే కాదు. ఎప్పుడో రెండేళ్ల కిందటే విడుదల కావాల్సిన నితిన్ సినిమా కొరియర్ బాయ్ కళ్యాణ్. గౌతమ్ మీనన్ నిర్మాణంలో ప్రేమ్ సాయి అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ సినిమా అనుకోని అవాంతరాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎప్పటికీ విడుదల కాదేమో అనుకుంటుంటే సడెన్ గా రిలీజ్ డేట్ ప్రకటించేశారు. సెప్టెంబరు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 20న హైదరాబాద్ లో భారీ స్థాయిలో ఆడియో వేడుక చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గౌతమ్ మీనన్ తో పాటు తెలుగు పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కాబోతున్నారు.

‘గుండె జారి గల్లంతయ్యిందే’ తర్వాత రావాల్సిన సినిమా ఇది. అప్పట్లో విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్ లో నితిన్ ఆస్థాన రచయితగా మారిన హర్షవర్ధన్ ఈ సినిమాకు మాటలు రాయడమే కాక.. ఓ కీలక పాత్ర కూడా పోషించాడు. తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ పేరు కలిసొచ్చేలా పి. కళ్యాణ్ (పని లేని కళ్యాణ్) అని పేరు పెట్టుకుని సందడి చేయబోతున్నాడు నితిన్. ట్రైలర్ లోనే పవన్ ప్రస్తావన వచ్చేసింది. యథావిధిగా సినిమాలోనూ పవన్ ను ఫుల్లుగా వాడేసుకుని ఉంటాడనడంలో సందేహం లేదు. ‘చిన్నదాన నీకోసం’ తర్వాత ఇప్పటికే 8 నెలలు గ్యాప్ తీసుకున్నాడు నితిన్. త్రివిక్రమ్ దర్శకత్వంలో అతడి కొత్త సినిమా ఇంకా మొదలే కాలేదు. బాగా గ్యాప్ వచ్చేస్తోందే అనుకుంటున్న తరుణంలో ఈ ఏడాదికి ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’తో గ్యాప్ ఫిల్ చేసేస్తున్నాడు నితిన్.


Tags:    
  • Nithin 
  • Courier Boy kalyan Movie 
  • telugu NEws 

Similar News

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

పిల్లి కళ్ల భామకు వరుస అవకాశాలు..!

2026-11-03 17:54 GMT

ఈ ఒక్క వారం ఏకంగా 24 చిత్రాలు ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎప్పుడు?ఎక్కడంటే?

2026-11-03 17:53 GMT

RC 17: నాన్నకు ప్రేమతో కాదు.. ఈసారి అమ్మకు ప్రేమతో..!

2026-11-03 17:51 GMT

దేవుడి కీర్తనను రాజకీయం చేస్తారా ?

2026-11-03 17:50 GMT

Copyright @2026

Powered by Blink CMS