కమెడియన్ అంటే కామెడీగా కనిపిస్తొందా?

Update: 2018-12-19 04:15 GMT
'ఊహలు గుసగుస లాడే'.. 'ఒక్క అమ్మాయి తప్ప'.. లాంటి ఎన్నో సినిమాల్లో పాత్రలు పోషించి ప్రేక్షకులకు కామెడీ పంచిన భద్రం టాలీవుడ్  లో ఒక పాపులర్ కమెడియన్. ఈమధ్య ఒక వెబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ప్రేక్షకులతో ఎన్నో విషయాలు పంచుకున్నాడు. కానీ యాంకర్ అడిగి.. అడగకుండా వదిలేసిన ఒక ప్రశ్నకు మాత్రం గుస్సా అయ్యాడు.  మధ్యలో ఇంటర్వ్యూ ను వదిలేసి వెళ్ళిపోవడానికి లేచాడు.

మరి అయన నిజంగానే లేచి వెళ్ళిపోయాడా.. లేదా యాంకర్.. వెబ్ ఛానల్ నిర్వాహకులు ఆయన్ను బుజ్జగించి వెనక్కు తీసుకొచ్చారా అన్నది ఇంకా తెలియదు. కారణం ఏంటంటే ఇది జస్ట్ ప్రోమో కాబట్టి. ఇంతకీ ఆ ఇంటర్వ్యూయర్ ఏం ప్రశ్న అడిగాడంటే.. 'ఇప్పుడు టాలీవుడ్ లో కమెడియన్స్ అందరూ హీరోలవుతున్నారు.  భద్రంగారు కూడా హీరో అయ్యే ఛాన్స్ ఉందా?'.  దీనికి భద్రం హీరోలాగా పోజ్ ఇస్తూ జవాబు చెప్పబోయేలోపు ఇంటర్వ్యూయర్ ప్రశ్న ను దాటవేసి.. మరో ప్రశ్నఅడుగుతాను అన్నాడు. భద్రం ఆ జవాబు చేప్పేందుకు ఉత్సాహం చూపిస్తూ 'మీరు హీరో.. అంటూ ఏదో అడిగారు' అన్నాడు. కానీ ఇంటర్వ్యూయర్ మాత్రం 'టాలీవుడ్ లో భద్రం గారు హీరో అవుతారా?.. అయినా అది మీకు సంబంధించిన ప్రశ్న కాదు" అన్నాడు.  దీనికి అప్సెట్ అయిన భద్రం "ఏంటండీ..కమెడియన్ అంటే మీకు కామెడీగా కనిపిస్తొందా?"అంటూ ఫైర్ అయ్యి లేచి వెళ్ళిపోయాడు.

ఇది కాకుండా ఇతర ప్రశ్నలకు మాత్రం చాలా కూల్ గా జోవియల్ గా జవాబులిస్తూ నవ్వించాడు.  డాక్టర్ అని చెప్పి పెళ్ళి చేసుకుని ఇప్పుడు యాక్టర్ అయినందుకు ఇంట్లో సెటైర్లు పడుతుంటాయని అన్నాడు.  అసలే యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ అని గుర్తు రాగానే  యంకర్ తో "మీరు ఊరికే మోసం మోసం అనకండి.. 'మోసం చేసిన భద్రం' అని థంబ్ నెయిల్స్ వస్తాయి" అని పంచ్ విసిరాడు. ఇదేదో ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది.. మీరూ ఈ ప్రోమోను ఒకసారి చూడండి.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View

Tags:    

Similar News