టీజర్ టాక్:మళ్లీ ఓ కొత్త పాయింట్ ట్రై చేసిన సందీప్!

Update: 2017-09-25 05:05 GMT
హిట్లు, ఫ్లాపులకి అతీతంగా సాగుతోంది యంగ్ హీరో సందీప్ కిషన్ కెరీర్. తెలుగులోనే కాదు తమిళంలో సైతం సందీప్ వరుస సినిమాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తమిళ దర్శకుడు సుశీంద్రన్ డైరెక్షన్ లో కెరాఫ్ సూర్య గా రాబోతున్నాడు సందీప్ కిషన్. గతంలో నా పేరు శివ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన సుశీంద్రన్ ఇప్పుడు సందీప్ ను కెరాఫ్ సూర్యగా చూపించేందుకు ఓ వినూత్నమైన కథను అల్లుకున్నట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి. తెలుగులో ఈ చిత్రాన్ని లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్ మెంట్స్ పతాకం చక్రి చిగురుపాటి నిర్మించారు. హ్యాపెనింగ్ హీరోయిన్ మెహరిన్ ఈ చిత్రంలో సందీప్ కిషన్ సరసన నటించింది. తమిళ సంగీత దర్శకుడు డి.ఇమాన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు.

తాజాగా చిత్ర బృందం విడుదల చేసిన ఓ కాన్సెప్ట్ టీజర్ కి సోషల్ మీడియాలో బాగానే రెస్పాన్స్ వస్తోంది. కమీడియన్ సత్యతో సందీప్ కిషన్ క్యారెక్టర్ ని పరిచయం చేయిస్తూ కట్ చేసిన ఈ టీజర్ ని చూస్తే సినిమాలో విషయం ఉందని అర్ధమవుతోంది. ఇక నటన విషయంలో సందీప్ కిషన్ కి మంచి మార్కులే ఉన్నాయి కనుక కెరాఫ్ సూర్యలో కూడా ఈ యంగ్ హీరో యాక్షన్ ఓ రేంజ్ లో ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేయెచ్చు. దీనికి తోడు సుశింద్రన్ సినిమాల్లో ఉండే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కెరాఫ్ సూర్యలో కూడా ఉన్నట్లుగా విశ్వసనీయ వర్గాలు సమాచారం. మరి ప్రస్తుతానికి టీజర్ తో ఆకట్టుకున్న కెరాఫ్ సూర్య టీమ్ త్వరలో విడుదల కాబోతున్న సినిమాతో ఏ రేంజ్ లో ఎంటర్ టైన్ చేస్తారో లెట్స్ వెయిట్ అండ్ సీ.

Full View
Tags:    

Similar News