ఎక్స్‌ క్లూజివ్‌ : బన్నీ ఆరవ వేలు పై క్లారిటీ!

Update: 2020-04-08 10:10 GMT
నేడు అల్లు అర్జున్‌ పుట్టిన రోజు సందర్బంగా ప్రస్తుతం ఆయన సుకుమార్‌ దర్శకత్వంలో చేస్తున్న పుష్ప చిత్రంకు సంబంధించిన రెండు పోస్టర్‌ లను విడుదల చేసిన విషయం తెల్సిందే. రెండు పోస్టర్‌ లలో మొదటి పోస్టర్‌ సింపుల్‌ గా ఉండగా రెండవ పోస్టర్‌ మాత్రం పలు విషయాలను మోసుకు వచ్చింది. రెండవ పోస్టర్‌ తో సినిమా ఎలా ఉండబోతుదనే విషయాన్ని తుపాకి విశ్లేషించి మీకు చెప్పింది. అలాగే రెండవ పోస్టర్‌ లో అల్లు అర్జున్‌ కాలికి  ఉన్న ఆరవ వేలును మొదటగా గుర్తించడం జరిగింది.

తాజాగా అల్లు అర్జున్‌ కు సన్నిహితంగా ఉండే వారి ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం నిజంగానే అల్లు అర్జున్‌ కు ఆరవ వేలు ఉంటుందట. కాలుకు లేదా చేతికి ఆరవ వేలు ఉంటే అదృష్టం అంటూ ఉంటారు. బన్నీ ఎంత అదృష్టవంతుడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల్లో స్టార్‌.. ఫ్యామిలీ పరంగా సూపర్‌.. ఇద్దరు చక్కనైన పిల్లలు. ఇంత అదృష్టం ఆరవ వేలు వల్లే అయ్యి ఉంటుందని ఇప్పుడు కొందరు సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు.

బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ కు ఆరవ వేలు ఉంటుంది. బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ గా హృతిక్‌ రోషన్‌ పేరు దక్కించుకున్న విషయం తెల్సిందే. అలాగే హృతిక్‌ డాన్స్‌ ల్లో టాప్‌ లో ఉంటాడు. ఇక టాలీవుడ్‌ విషయానికి వస్తే అల్లు అర్జున్‌ డాన్స్‌ లో టాప్‌ లో ఉంటాడు. ఆరవ వేలు ఉన్న ఇద్దరు హీరోలు కూడా డాన్స్‌ ల్లో టాప్‌ లో ఉండటం కాకతాళీయమో లేదంటే అదృష్టమో. మొత్తానికి బన్నీ ఆరవ వేలు వల్లనో లేదంటే మరే కారణమో కాని టాలీవుడ్‌ లో ప్రస్తుతం బన్నీ టాప్‌ స్టార్‌ గా ఉన్న విషయం తెల్సిందే.


Tags:    

Similar News