ఈసారి 'బిగ్ బాస్-4'లో పాల్గొనే కపుల్ వారేనా..?

Update: 2020-07-24 11:30 GMT
తెలుగు టెలివిజన్ తెరపై బిగ్ బాస్ రియాలిటీ షోకి మాములు క్రేజ్ లేదు. మొత్తం రెండు రాష్ట్రాలలో బిగ్ బాస్ క్రమం తప్పకుండా వీక్షించేవారు లక్షల సంఖ్యలో ఉన్నారు. అలాగే బిగ్ బాస్ వీక్లీ ఓసారి రిపీట్ చేసుకొని చూసేవారు కూడా చాలానే ఉన్నారు. ఇక మరో రకం ఉంటారు.. షో చూడకపోయినా వీక్లీ ఎవరు ఎలిమినేట్ అయ్యారని కనుక్కుంటూ ఉంటారు. ఏంటి అలా కూడా ఉన్నారా.. అంటే అలాంటి వారి సంఖ్య కూడా బాగానే ఉంది. వారికి చూసే సమయం లేకనో.. లేదా పనిలో నిమగ్నమై ఉండటం లాంటి.. ఎవరి కారణాలు వాళ్ళకి ఉంటాయి కదా! అయితే త్వరలోనే బిగ్ బాస్ గ్రాండ్ గా ప్రారంభం కానుందని ఇటీవలే స్టార్ మా యాజమాన్యం ప్రోమో విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ బిగ్ బాస్ కోసం తెలుగు జనాలు ఎప్పటినుందో ఎదురు చూస్తున్నారు. కరోనా రావడంతో అన్నీటి టైమింగ్స్ మారిపోయాయి.

జూన్ లోనే ప్రారంభం అవుతుందనుకున్నారు కానీ కరోనా వ్యాప్తి పెరిగింది. ఆఖరికి అసలు ఈసారి బిగ్ బాస్ ఉంటుందా లేదా అనుమానం అందరిలో కలిగింది. అయితే షో పక్కా ఉంటుందని క్లారిటీ ఇవ్వడంతో కాస్త నెమ్మదించారు. అలా క్లారిటీ వచ్చిందో లేదో బిగ్ బాస్ అభిమానులలో కంటెస్టెంట్స్ ఎవరనేది ఆసక్తి మొదలయింది. ఇక ఫ్యాన్స్ అంచనాలు రెట్టింపు చేస్తూ బిగ్ బాస్ యాజమాన్యం.. ఈసారి గ్లామర్ హీరోయిన్లను తీసుకొస్తాం అని ఊరించారు. ఆ విషయం పక్కన పెడితే గత సీసన్లో హీరో వరుణ్ సందేశ్, అతని భార్య వితిక షేరు పాల్గొన్నారు. అయితే ఈసారి కూడా ఓ టాలీవుడ్ కపుల్ పాల్గొనే ఛాన్స్ ఉందని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వారే కొరియోగ్రాఫర్ రఘు, ఆయన భార్య సింగర్ ప్రణవి పాల్గొంటారని సమాచారం. అధికారిక ప్రకటన రాలేదు కానీ ఈ లవ్ కపుల్ అందరికి సుపరిచితమే. ఇక మరి ఆగస్టు 16న ప్రారంభం అవుతుందని అంటున్నారు. బిగ్ బాస్ -4 కూడా కింగ్ నాగార్జున హోస్ట్ చేయనున్నారట.
Tags:    

Similar News