ఆరవనేల మీద సైరా పాగా

Update: 2019-06-12 04:39 GMT
మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆయన నూటా యాభై సినిమాల కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సైరా షూటింగ్ చివరి దశలో ఉంది. ఒకపక్క అయిపోయింది అంటూనే మరోపక్క బాలన్స్ సన్నివేశాలను తీస్తూనే ఉన్నారు. తాజా అప్ డేట్ ప్రకారం సైరా టీం ప్రస్తుతం తమిళనాడులోని పాండిచెర్రిలో ఉంది. అక్కడ నరసింహారెడ్డి బృందానికి బ్రిటిష్ ఆఫీసర్లకు మధ్య జరిగే కొన్ని కీలక ఒప్పందాలకు సంబంధించిన సన్నివేశాలు తీస్తున్నట్టు తెలిసింది.

ఇవి కథలో చాలా కీలకమైనవి కావడంతో సెట్స్ వేసి తీసే పరిస్థితి లేకపోవడంతో అప్పటి కాలం నాటి బిల్డింగ్స్ పాండిచెర్రిలో ఉండటంతో టీం అక్కడికే వెళ్లి పని కానిస్తోంది. ఇది చేసుకుని రాగానే సైరా సెట్స్ కు వెళ్ళే అవసరం ఉండకపోవచ్చు. దర్శకుడు సురేందర్ రెడ్డి మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ మీదే దృష్టి సారించనున్నాడు. ఇప్పటికే రెండేళ్ళకు పైగా నిర్మాణం కొనసాగిన సైరా అక్టోబర్ 2 విడుదల కావడం దాదాపు ఖాయమే. కాకపోతే అధికారిక ప్రకటన వచ్చేందుకు కొంత సమయం పడుతుంది.

ఎలాగూ చిరంజీవి పుట్టిన రోజు ఆగష్టు 22న వస్తోంది. ఆ రోజు కొత్త టీజర్ తో పాటు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే వివిధ ఏరియాలకు సంబంధించిన డిస్ట్రిబ్యూటర్లతో చరణ్ బృందం చర్చల్లో ఉంది. సుమారు 200 కోట్ల దాకా ఖర్చు పెట్టిన బడ్జెట్ కావడంతో సైరా మీద చాలా రిస్క్ చేశాడు చరణ్. నాన్నకు మర్చిపోలేని ల్యాండ్ మార్క్ మూవీ ఇవ్వాలని చేస్తున్న ప్రయత్నం దానికి తగ్గ ఫలితం ఇవ్వడం ఖాయమని యూనిట్ సభ్యులు అంటున్నారు.

    

Tags:    

Similar News