పిక్ టాక్: దీపావళి కాంతుల్లో వెలిగిపోతున్న చిరు - చిరుత..!

Update: 2020-11-16 03:30 GMT
కోవిడ్ నేపథ్యంలో జాగ్రత్తగా షూటింగ్స్ చేసుకుంటూ వస్తున్న సినీ ప్రముఖులంతా.. అంతే జాగ్రత్తగా కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా తమ అభిమానులతో పంచుకున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన పోస్ట్ అందరినీ ఆకర్షించింది. దీపావళిని పురస్కరించుకుని చిరంజీవి తన కుమారుడు రామ్‌ చరణ్‌ తో కలిసి తీసుకున్న ఓ సెల్ఫీ ఫొటోను ఫ్యాన్స్ తో పంచుకున్నారు.

బ్యాగ్రౌండ్ లో తారాజువ్వలు ఆకాశంలో వెలుగుతుండగా.. చిరు - చరణ్‌ ఇద్దరూ సెల్ఫీకి ఫోజులిస్తూ కనిపించారు. ఇందులో చిరు తనయుడు చరణ్‌ భుజంపై చేయివేసి కనిపిస్తున్నాడు. ట్రెడిషనల్ దుస్తుల్లో ఉన్న తండ్రీకొడుకుల నవ్వు ముఖాలు దీపావళి కాంతుల్లో వెలిగిపోతున్నాయి. చాలా రోజుల తరువాత ఇద్దరినీ ఒకే ఫ్రేమ్ లో చూసిన అభిమానులు ఈ ఫొటోను చూస్తూ మురిసిపోతున్నారు.

ఇటీవల మెగాస్టార్ కరోనా బారిన పడ్డారని వెళ్లడించిన సంగతి తెలిసిందే. అయితే మూడు రోజులు గడిచినా ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో మరోసారి పరీక్షలు చేయించుకున్నానని, నెగిటివ్​ గా తేలిందని స్పష్టం చేశారు. దీంతో అప్పటి వరకు చిరు కి కరోనా సోకిందని కలవరపడిన మెగా అభిమానులంతా ఉపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు తండ్రీకొడుకులు సెల్ఫీ తీసుకొని ఫ్యాన్స్ కి దీపావళి గిఫ్ట్ అందించారు. ఇప్పుడు ఈ మెగా సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Tags:    

Similar News