డాడీ వ‌ర్సెస్ చెర్రీ! వైర‌స్ తెచ్చిన తంటా!!

Update: 2020-06-27 05:15 GMT
మ‌హ‌మ్మారీ ప్ర‌కంప‌నాలు కొన‌సాగుతున్నాయి. ముఖ్యంగా వినోద‌ ప‌రిశ్ర‌మ‌ల్ని వైర‌స్ అత‌లాకుతలం చేసింది. ఏం చేయాలో పాలుపోని ప‌రిస్థితి ఉందిప్పుడు. షూటింగుల‌కు వెళితే మ‌హ‌మ్మారీ రార‌మ్మ‌ని కౌగిలించుకుంటోంది. వ‌రుస‌గా స్టార్లు క‌రోనా భారిన ప‌డుతున్నార‌న్న వార్త‌లు భ‌యాందోళ‌న‌ల‌కు కార‌ణ‌మ‌వుతోంది. కార‌ణం ఏదైనా ఇప్ప‌టికే అగ్ర హీరోలంతా సెప్టెంబ‌ర్  నుంచి డిసెంబ‌ర్ వ‌ర‌కూ వేచి చూడాల్సిందిగా ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు చెప్పేస్తున్నారు. ప‌ర్య‌వ‌సానంగా ఇప్ప‌టికే అనుకున్న షెడ్యూల్స్ అన్నీ వాయిదా వేసే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. జూలై నాటికి అయినా స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంద‌నుకుంటే అస‌లు ఇప్ప‌ట్లో వ‌ల్ల కాద‌ని తేలి పోయింది.

స‌రిగ్గా ఇదే వైర‌స్ ప‌రిశ్ర‌మ‌ లోని ఆ డాడీ స‌న్ మ‌ధ్య క‌ల‌త‌ల‌కు కార‌ణ‌మ‌వుతోంద‌ట‌. ఇంత‌కీ ఎవ‌రా డాడీ స‌న్ అంటే ఇంకెవ‌రు?  చిరంజీవి .. రామ్ చ‌ర‌ణ్‌. ఆ ఇద్ద‌రూ క‌లిసి ఆచార్య చిత్రం లో న‌టించనున్న సంగ‌తి తెలిసిందే. చ‌ర‌ణ్ ఆర్.ఆర్.ఆర్ చిత్రీక‌ర‌ణ ముగించి ఆచార్య సెట్స్ కి రావాల్సి ఉంది. అయితే తాజా ప‌రిస్థితుల్లో వీలు ప‌డే స‌న్నివేశం క‌నిపించ‌డం లేదు. ఆర్.ఆర్.ఆర్ స‌హా అన్ని సినిమాల షూటింగులు వాయిదా ప‌డ‌డంతో షెడ్యూల్స్ ప‌రంగా ట్ర‌బుల్ ఎదురైంది. ప‌ర్య‌వ‌సానంగా చాలామంది ఆర్టిస్టుల కాల్షీట్ల‌ను మ్యానేజ్ చేయ‌డం క‌ష్ఠ‌త‌రంగా మారుతోంద‌ట‌.

ఇదే రీజ‌న్ ఇప్పుడు ఆచార్య‌కు చిక్కులు తెచ్చిపెడుతోంది. చ‌ర‌ణ్ లేకుండా చిరుతో కొర‌టాల‌ కానిచ్చేయాల‌న్నా ఇప్ప‌ట్లో వీలుప‌డేట్టు లేదు. దీంతో ఇప్ప‌టికే కాల్షీట్లు ఇచ్చిన ప‌లువురు న‌టీన‌టుల‌కు ఆచార్య కాల్షీట్ల స‌ర్ధుబాటు స‌మ‌స్యాత్మ‌కంగా మార‌నుంద‌ని భావిస్తున్నారు. ఇకపోతే చ‌ర‌ణ్ .. ఎట్టి ప‌రిస్థితుల్లో ఆచార్య చిత్రంలో న‌టించాల్సిందేన‌ని ప‌ట్టుబ‌ట్టిన చిరు సైతం ఇప్పుడు మ‌రోమారు ఆలోచించుకోవాల్సిన ప‌రిస్థితి త‌లెత్తింద‌ట‌. చ‌ర‌ణ్ తోనే ముందుకు వెళ్లాలా?  లేక ఇంకెవ‌రైనా స్టార్ ని ఎంపిక చేయాలా? అన్న‌దానిపై ఇప్పుడు కొర‌టాల నిర్ణ‌యించుకోవాల్సి ఉంటుంద‌ని కూడా తెలుస్తోంది.

చ‌ర‌ణ్ కాల్షీట్లు స‌ర్ధుబాటు చేస్తేనే ఇత‌ర స్టార్ల కాల్షీట్ల‌కు స‌మ‌స్య త‌లెత్త‌దు. కానీ చెర్రీ అందుకు సిద్ధంగా లేడు. ఆర్.ఆర్.ఆర్ కే త‌న తొలి ప్రాధాన్య‌త‌. ఆ త‌ర్వాత‌నే ఆచార్య‌. అక్క‌డ లైన్ క్లియ‌ర్ అయితే కానీ ఆచార్య‌కు క్లారిటీ ఇవ్వ‌లేడు. స‌న్నివేశం చూస్తుంటే చెర్రీని కాద‌ని వేరే స్టార్ తోనే కొర‌టాల‌ ముందుకు వెళ్లినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌ని భావిస్తున్నారు. ఇక ఆచార్య నిర్మాత‌ల్లో ఒక‌రిగా ఉన్న చ‌ర‌ణ్ కి నిర్మాణ‌మే పెను భారం అనుకుంటే ఇప్పుడు న‌టుడిగానూ కాల్షీట్లు స‌ర్ధుబాటు చేయ‌డం స‌మ‌స్యాత్మ‌కం అవుతోంది.
Tags:    

Similar News