కాజ‌ల్ తో చిరు రొమాన్స్ ఈసారి ఏమంటారో?!

Update: 2021-03-20 12:48 GMT
మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న‌ `ఖైదీనంబ‌ర్ 150`లో కాజ‌ల్ క‌థానాయిక‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. అస‌లు తండ్రి వ‌య‌సు  హీరోతో కాజ‌ల్ రొమాన్స్ చేస్తుందా? అంటూ పెద‌వి విరిచేశారు. వినాయ‌క్ సెలక్ష‌న్ చూశాక‌.. ఆ ఎంపిక ఏమిటో అని కూడా పెద‌వి విరిచేశారు. క‌ట్ చేస్తే సినిమా రిలీజైంది. బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టింది. ఆ మూవీలో కాజ‌ల్ తో చిరు రొమాన్స్ వ‌ర్క‌వుటైంది. అయితే తెర‌పై ఎక్క‌డా ఆ ఇద్ద‌రి మ‌ధ్యా స‌న్నివేశాల్లో అస‌భ్య‌త అన్న‌దే క‌నిపించదు.

ఇప్పుడు మ‌రోసారి కాజ‌ల్ తో చిరు రొమాన్స్ చేస్తున్నారు. కొర‌టాల తెర‌కెక్కిస్తున్న `ఆచార్య`‌లో కాజ‌ల్ తో చిరు రొమాన్స్ ఎలా ఉండ‌బోతోంది? అన్న చ‌ర్చ మొద‌లైంది అభిమానుల్లో. కేవ‌లం  రొమాంటిక్ సీన్స్ మాత్ర‌మే పెండింగులో ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఇంత‌కుముందే మారేడుమిల్లి అడ‌వుల్లో చ‌ర‌ణ్ - పూజా హెగ్డే.. చ‌ర‌ణ్ - చిరుల‌పై కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌రణ‌ను పూర్తి చేసారు. ఆ త‌ర్వాత ‌ఖ‌మ్మంలోని బొగ్గు గనుల్లో రామ్ చరణ్- చిరుపై కొన్ని యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించారని స‌మాచారం. ప్ర‌స్తుతం చిరు-కాజ‌ల్ జోడీపై రొమాంటిక్ సీన్స్ పెండింగ్ అని తెలిసింది.  

తాజా షెడ్యూల్ కోసం కాజ‌ల్ మ‌రోసారి ఆచార్య సెట్లో జాయిన‌వుతున్నారు. ఈ విష‌యాన్ని కాజ‌ల్ స్వ‌యంగా తెలిపారు. నాకు ఎంతో ఇష్ట‌మైన హీరోతో షూటింగ్ చేస్తున్నాను. అది ఎవ‌రో క‌నిపెట్టండి! అంటూ కాజ‌ల్ ఓ ఫోటోని షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా మారింది. చేతికి ఎర్ర‌కండువా.. ఆ గొలుసులు చూడ‌గానే మెగాస్టార్ ఆచార్య లుక్ ఇద‌ని అర్థ‌మ‌వుతోంది. డీసెంట్ రొమాన్స్ తో చిరు-కాజ‌ల్ జంట మ‌రోసారి ఆడియెన్ ని ఒప్పించాల్సి ఉంటుంది.
Tags:    

Similar News