చిరును నమ్ముకుంటే.. అలా నడిచొచ్చేస్తాయ్

Update: 2016-07-28 06:38 GMT

అభిమానలను ఆన్ స్క్రీన్ పై ఎంటర్టెయిన్ చేసేందుకు అందరు హీరోలు ప్రయత్నిస్తారు. కానీ ఫ్యాన్స్ తో అంతకు మించి..  రిలేషన్స్ మెయింటెయిన్ చేసేవారు చాలా కొద్ది మందే. టాలీవుడ్ లో ఈ కొద్ది మంది లిస్ట్ రాస్తే.. మెగాస్టార్ చిరంజీవి పేరు ఫస్ట్ రాయాల్సిందే. అంతగా అభిమానులపై తన ప్రేమ కురిపిస్తారాయన.

మెగాస్టార్ కు ఉన్న అపారమైన అభిమాన గణంలో.. ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్ క్రాంతి పిక్చర్స్ రెడ్డి ఒకరు. మెగా మూవీస్ ని మాగ్జిమం ఈయనే డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. అయితే.. ఇప్పుడు మార్కెట్ చాలా పెరిగిపోయింది. దీంతో పాటే పోటీ కూడా పెరిగింది. ప్రస్తుతం మెగాస్టార్ చేస్తున్న 150వ మూవీ కోసం ఈ పోటీ చాలా తీవ్రంగా ఉంది. భారీ ఆఫర్లతో అనేక మంది మెగా150 ని దక్కించుకునేందుకు యత్నిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్న వాళ్లలో క్రాంతి పిక్చర్స్ అధినేత కూడా ఉన్నాడు.

అయితే.. రెడ్డి రైట్స్ అడుగుతున్నాడని తెలిసిన చిరు.. మిగిలిన ఆఫర్స్ ను పక్కన పెట్టేసి మరీ అతనికే సినిమా ఇవ్వమని తేల్చేశారట. అంతకంటే ఎక్కువ మొత్తానికి ఆఫర్స్ ఉన్నాసరే ఏ మాత్రం ఆలోచించకుండా తన 150వ సినిమా ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూషన్ హక్కులు క్రాంతిపిక్చర్స్ కే కట్టబెట్టి.. అభిమానులంటే తనకు ఎంత ఇష్టమో చెప్పకనే చెప్పారు చిరు. దటీజ్ మెగాస్టార్.
Tags:    

Similar News