టాలీవుడ్ స్టైల్ ఐకాన్ మెగాస్టార్..

Update: 2015-08-22 06:43 GMT
తెలుగు సినిమా ఇండస్ట్రీకి నాట్యం నేర్పినది అక్కినేని నాగేశ్వర్రావు అయితే... డ్యాన్స్ కి వేగం తెచ్చిన వ్యక్తి చిరంజీవి. కేవలం ఫైట్లు, డ్యాన్సులే కాదు.. టాలీవుడ్‌ కి ‍స్టైల్ కి చిరు అద్దిన హంగులు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా సినిమాకో వేషంతో రెచ్చిపోయి మరీ మాస్‌ కి మహా చేరువయ్యారు మెగాస్టార్. చిరంజీవి ఏదైనా స్టైల్ చూపించాడంటే... ఇక వాటికి ఫుల్ క్రేజ్ వచ్చేసినట్లే. డ్రస్సుల విషయంలో స్పెషల్ కేర్ తీసుకోవడం, ఫారిన్ నుంచి ప్రత్యేకంగా తెప్పించి ధరించడం అనే ట్రెండ్ స్టార్ట్ చేసింది మెగాస్టారే.  

ఒక్కో సినిమాకి చిరు ఒకో స్టైల్ ఫాలో అవుతుంటారు. ఇప్పటికి 149 సినిమాలు చేసినా సరే.. ఒక ఫోటో చూస్తే... అది ఏ మూవీలోనిదో చెప్పేయచ్చు. అంత డిఫరెంట్ గా ఉంటుంది ఆయన స్టైలింగ్. కొదమ సింహంలో టోపీ పెట్టిన గెటప్ తర్వాత... ఆ టైప్ టోపీలకు తెగ డిమాండ్ పెరిగింది. ఇక రఫ్‌గా ఎలా ఉండాలో చిరుని చూసి నేర్చుకోవచ్చు. గ్యాంగ్ లీడర్ లో గడ్డంతో కనిపిస్తూ... చెయ్యి చూశావా ఎంత రఫ్‌ గా ఉందో, రఫ్పాడిస్తా అనే డైలాగ్... దశాబ్దాలు గడిచినా.. ఇప్పటికే జనాలనోళ్లలో నానుతోంది. , ముఠామేస్త్రిలో చిరు సైకిల్ తొక్కడం మొదలుపెట్టాక... సైకిల్ వెనక తాళ్లు కట్టుకు తిరగడం ఓ ట్రెండ్ అయింది.

ఘరానా మొగుడులో లుంగీ కట్టుకుని వేసే డ్యాన్స్ అయితే... ఇప్పటికీ జనాల కళ్లలో మెదులుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆటోజానీ అంటున్నారు కానీ... ఈ గెటప్ రౌడీఅల్లుడులో ఒక కేరక్టర్ దే. నోట్లో బీడీముక్క పెట్టుకుని... నీచ్, కమీన్, కుత్తే... అంటూ కేకలు పెట్టించేశారు చిరంజీవి. ఆయన ఇంద్ర మూవీలో ఓ సాంగ్ లో మల్టీ కలర్ షర్ట్స్ వేస్తారు. ఓ రెండు, మూడేళ్లపాటు.. మార్కెట్ లో ఎక్కడ చూసినా ఈ టైప్ షర్ట్ లే కనిపించేవి. ఫారిన్ స్టైల్ కళ్లజోళ్లు,  డ్రస్సులు, ఫ్యాషన్...ఇవన్నీ 30 ఏళ్లకు ముందునుంచే తెలుగు జనాలకు పరిచయం చేసేశారు చిరంజీవి.
Tags:    

Similar News