మెగా ఛాలెంజ్ ని లైట్ తీస్కున్నారేమిటి?
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో సెలబ్రిటీలు ఇండ్లకే పరిమితమై ఇంటి పని వంట పని చేస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి సైతం అందుకు అతీతులేమీ కారు. ఆయనా ఇల్లు ఊడ్చారు. దోసెలు వేశారు. అందుకు సంబంధించిన ఫోటోల్ని సోషల్ మీడియాల్లో షేర్ చేస్తూ ఓ ముగ్గురిని నామినేట్ చేశారు.
`#బీ ది రియల్ మేన్` ఛాలెంజ్ ను ఓ ముగ్గురి పైకి విసిసారు చిరు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్.. తమిళ టెక్నికల్ డైరెక్టర్ మణిరత్నం.. టి.ఆర్.ఎస్ మంత్రి కెటిఆర్ లను నామినేట్ చేస్తూ లింక్ ని షేర్ చేశారు. కానీ దీనికి ఆ ముగ్గురూ స్పందించారా? అంటే.. వీళ్లంతా మెగాస్టార్ సవాలును స్వీకరించే పరిస్థితి కనిపించలేదు.
చిరంజీవి రజనీకాంత్ మంచి స్నేహితులు... పైగా సహచర తారలు అయినా రజనీ ఎందుకనో లైట్ తీస్కున్నారు. ఇక రజినీ కొంతకాలంగా మెగాస్టార్ కి క్లోజ్ గా లేనే లేరు. ఆయన వ్యాపకాల్లో ఆయన బిజీ బిజీగా ఉంటున్నారు. ప్రతి సంవత్సరం `ఎయిటీస్ స్టార్స్ అలయెన్స్` పార్టీకి హాజరవ్వడం లేదు. పైగా ఇటీవలి కాలంలో రజినీ నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కావడం లేదు. కోలీవుడ్ లో విజయ్ వరుస సూపర్ హిట్లతో నంబర్ వన్ స్టార్ గా ఎదిగాడు. అనధికారికంగా కోలీవుడ్ అతడిదే. ఇవేవీ కారణాలు కాదు కానీ.. రజినీ ఏజ్ దృష్ట్యా.. రాజకీయారంగేట్రం ఆలోచనలతో సతమతమవ్వడం వల్లనూ ఒత్తిడిని ఎదుర్కొంటూ తన సహనటులు సహచరులతో కలవలేకపోతున్నారు. సోషల్ మీడియాల్ని పట్టించుకునే పరిస్థితి లేదని విశ్లేషిస్తున్నారు.
ఒకప్పుడు భారతదేశంలోనే గొప్ప టెక్నికల్ డైరెక్టర్ గా ప్రశంసలు అందుకున్న మణిరత్నం.. గత రెండు దశాబ్దాలుగా వరుస ఓటములతో తన ప్రాభవాన్ని కోల్పోయారు. అతను సోషల్ మీడియాలో ఇంత చురుకుగా ఎప్పుడూ లేరు. మెగాస్టార్ సవాలును స్వీకరించడానికి ఆయన ఇష్టపడక పోవడాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇక యువనాయకుడు కేటీఆర్ మంత్రిగా తన బాధ్యతలను నిర్వర్తించడంలో పూర్తిగా తలమునకలుగా ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ లో కరోనా వైరస్ ను అంతమొందించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ సమయంలో రాజకీయ పరంగా.. నాన్ కరోనా సమస్యలపై స్పందించడం తప్పుడు సంకేతాల్ని పంపిస్తుంది. అందుకే ఆయన మెగాస్టార్ సవాలును స్వీకరించలేదు. ఇక ఆ ముగ్గురి సన్నివేశాన్ని అర్థం చేసుకోకుండా చిరు వారిని నామినేట్ చేశారా? అన్న ప్రశ్న ఎదురవుతోంది. మరి దీనికి మెగా సమాధానం ఏమిటో!