చిరంజీవి వాయించి మరీ వసూలు చేస్తున్నాడట..!
ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి పెద్ద మనసు కావాలి.. ఇప్పుడు సినీ వినీలాకాశంలో ధృవతారలుగా ఎదుగుతున్నారంటే అదంతా ప్రేక్షకులు పెట్టిన భిక్ష. ఈ కరోనా కష్టకాలంలో అందరూ తిండికి లేకుండా ఉన్నారు. సినీ కార్మికుల పరిస్థితి దారుణంగా ఉంది. సినిమాలు తీసి కోట్లు కూడబెట్టుకున్న సినీ ప్రముఖులు ఇప్పుడు రూపాయి విదిల్చికపోవడంపై చిరంజీవి సీరియస్ అయ్యారని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంత సంపాదించి ముష్టిగా విరాళం ఇచ్చిన వారిని.. అస్సలు ఇవ్వని వారికి ఫోన్ చేసి చిరంజీవి వాయించేస్తున్నారట..
సినీ కార్మికుల కోసం విరాళాలు పోగు చేస్తున్న చిరంజీవి ఈ విషయంలో స్వయంగా స్టెప్ తీసుకొని సినీ కార్మికుల కడుపు నింపుతున్నారు. ఈ కోవలోనే సంపాదించినా సాయం చేయని వారికి ఫోన్ చేసి మరీ వాయించేసి సాయాన్ని వసూలు చేస్తున్నారు.
సినిమాలు ఆగిపోయి.. షూటింగ్స్ నిలిచిపోయి సినీ కార్మికులంతా అష్టకష్టాలు పడుతున్నారు. ఈ మేరకు చిరంజీవి ‘కరోనా క్రైసిస్ చారిటీ’ సంస్థను స్థాపించి 6 కోట్ల విరాళాలు సేకరించారు. వాటిని సినీ కార్మికుల అవసరాలకు వినియోగిస్తున్నారు.
అయితే దీనికి విరాళం ఇవ్వడానికి కొందరు నటీనటులకు ఇష్టం లేదట.. ముందుకు రావడం లేదట..మొహమాటంగా తక్కువ విరాళం ఇస్తున్నారట. దీంతో స్వయంగా చిరంజీవి ఫోన్ చేసి వెంటపడి మరీ వసూలు చేస్తున్నారట.. సంపాదన ఉన్నా ఇవ్వని వారి వైఖరి చిరుకు నచ్చలేదట..
దీంతో ఇక నుంచి శాశ్వత ఫండ్ ఏర్పాటు చేసి అందరి దగ్గర వసూలు చేసి వాటిని సంక్షేమం కోసం ఖర్చు చేయాలని చిరంజీవి డిసైడ్ అయినట్టు సమాచారం. చిరంజీవి చూపిస్తున్న చొరవకు సినీ కార్మికుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి.