ఉయ్యాలవాడ టీం ఎంత ఎలర్ట్ అంటే

Update: 2017-04-27 06:05 GMT
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.. మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం దర్శకుడు సురేందర్ రెడ్డి చాలానే కష్టపడుతున్నాడు. ఇప్పటికే మూవీ స్టోరీకి సంబంధించిన రీసెర్చ్ అంతా వర్క్ పూర్తి చేసి.. ఫైనల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్న సురేందర్ రెడ్డి టీం.. ఇప్పుడు కాస్ట్యూమ్స్ పై దృష్టి పెట్టింది.

తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడిగా చరిత్రకెక్కిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర విషయంలో.. ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించడం లేదు సూరి. 180 ఏళ్ల క్రితం నాటి కథను చెప్పడంలో ప్రతీ అంశంలోనూ జాగ్రత్తలు పాటిస్తున్నాడు. ఇప్పుడు పాత్రధారులకు సంబంధించిన కాస్ట్యూమ్స్ పై దృష్టి పెట్టాడు. ఈ మూవీలో నటించే అందరు పాత్రధారులకు ఎవరి స్టైలిస్ట్ లు వారికి ఉంటారు. అయితే.. మూవీ థీమ్ ప్రకారం కాస్ట్యూమ్ డిజైనింగ్ ఉండేలా అందరికీ సూచనలు ఇస్తున్నాడట. ఇక్కడే అసలు సమస్య ఎదురైందని తెలుస్తోంది.

దక్షిణాదికి సంబంధించిన చరిత్ర అంతగా పుస్తకీకరణ చేయలేదు. 200 ఏళ్ల నాటి వ్యక్తుల వస్త్రధారణ ఎలా ఉంటుందనే విషయంపై కూడా ఆనవాళ్లు లేవు. అందుకే ఆనాటి కాలాన్ని ప్రతిబింబించేలా అందరి దుస్తులు ఉండేలా చర్యలు చేపడుతున్నాడట సురేందర్ రెడ్డి. ఇప్పటికే పలువురు స్టైలిస్ట్ లు ఈ పనిలో నిమగ్నమయ్యారని తెలుస్తోంది. ఆగస్ట్ లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందని రీసెంట్ గా నిర్మాత రామ్ చరణ్ అనౌన్స్ చేశాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News