• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సైరా సాయం కోరుతున్న...

సైరా సాయం కోరుతున్న అర్జున్

By - Tupaki Desk
Update: 2019-04-22 07:15 GMT
కుర్ర హీరోల్లో ఎలాంటి సపోర్ట్ లేకుండా వైవిధ్యమైన కథలతో హిట్లు కొట్టిన నిఖిల్ అంటే ప్రేక్షకుల్లోనూ ప్రత్యేకమైన అభిప్రాయం ఉంది. హ్యాపీ డేస్ లాంటి యూత్ ఫుల్ కాలేజీ స్టొరీతో పరిచయమైనా కార్తికేయ-స్వామి రారా లాంటి వినూత్న ప్రయోగాలతోనే ఎక్కువ పేరు తెచ్చుకున్న నిఖిల్ కొత్త సినిమా అర్జున్ సురవరం మే 1న కార్మిక దినోత్సవం నాడు విడుదలవుతోంది. ఇప్పటికే రెండు మూడు సార్లు పోస్ట్ పోన్ చేసుకున్న ఈ మూవీ ఇప్పుడు మాత్రం పక్కాగా లాక్ చేసుకుంది.

చేతిలో ఇంకా ఎనిమిది రోజుల టైం మాత్రమే ఉంది. పోటీ పెద్దగా లేదు కాబట్టి ఈ అవకాశాన్ని వాడుకుని ఆల్రెడీ ప్రూవ్ అయిన కంటెంట్ కాబట్టి గట్టి హిట్టు కొట్టాలనే టార్గెట్ తో ఉంది నిఖిల్ టీం. ఈ నేపధ్యంలో అర్జున్ సురవరంకు గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేయబోతున్నారు నిర్మాత టాగోర్ మధు. ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవిని రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. చిరు సైరా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

ఈ కారణంగా తనను అన్నయ్యలా భావించే లారెన్స్ పిలిచినా కాంచన 3 వేడుకకు వెళ్లలేకపోయారు. కాని టాగోర్ మధుతో ఉన్న అనుబంధం దృష్ట్యా కాస్త కష్టమైనా సైరాకు చిన్న బ్రేక్ ఇచ్చి అర్జున్ సురవరం ఫంక్షన్ కు వచ్చే అవకాశం ఉందని యూనిట్ నమ్మకంగా ఉంది. నిర్మాత మధుకి ఇంటిపేరుగా మారేంత సక్సెస్ ఇచ్చిన టాగోర్ మూవీ అంటే చిరుకు సైతం ప్రత్యేకమైన ఇష్టం. అందుకే అర్జున్ సురవరంకు సైరా అతిధిగా వచ్చే అవకాశాలను కొట్టి పారేయలేం.
    

Tags:    
  • Chiranjeevi 
  • Nikhil Siddarth 
  • Arjun Suravaram Movie 
  • Telugu News 
  • Latest updates 

Similar News

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

Copyright @2026

Powered by Blink CMS