చిరంజీవి మళ్ళీ 'అందరివాడు' అయ్యాడు..!
టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన మెగాస్టార్ చిరంజీవిని ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తారో, ఆయనకు అభిమానుల్లో ఉన్న క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మూడు దశాబ్దాలు ఇండస్ట్రీని ఏలిన హీరో చిరు. అందరితో అన్నయ్యా అని పిలుచుకున్న చిరంజీవి.. తన సేవాగుణంతో ఎన్నో మంచి పనులు చేసి మహోన్నత శిఖరంగా ఎదిగారు. బ్లడ్ బ్యాంక్ - ఐ బ్యాంక్ లను స్థాపించి ఆయన చేసిన సేవ గురించి తెలిసిందే. సేవాగుణం అనే పదానికి ఒక నిర్వచనంగా జనాలు చెప్పుకొనే స్టేజీకి వచ్చాడు. అయితే సినిమాల్లో ఉన్నప్పుడు 'అందరివాడు' అనిపించుకున్న చిరు.. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత 'కొందరివాడు' అనే పేరు తెచ్చుకోవాల్సి వచ్చింది.
ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో 'ప్రజారాజ్యం' పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి.. పొలిటికల్ లీడర్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు. దీనికి కారణాలేవైనా 2014 ఎన్నికల్లో ఓటమి పాలవ్వడం.. పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రి హోదా అనుభవించడం వంటివి చిరు ఇమేజ్ ను బాగా దెబ్బ తీశాయని చెప్పవచ్చు. ఈ క్రమంలో తనను అభిమానించే వారి నుంచే ఎన్నడూ లేని విధంగా విమర్శలు.. వ్యతిరేకత వ్యక్తం అయ్యాయి. అయితే రాజకీయాలు తనకు సరిపడని గ్రహించిన చిరంజీవి.. వాటికి దూరంగా ఉంటూ మళ్ళీ సినిమా రంగంపై ఫోకస్ పెట్టారు. 'రాననుకున్నారా.. రాలేరనుకున్నారా' అంటూ కంబ్యాక్ ఇచ్చిన చిరుని మళ్ళీ జనాలు మెగాస్టార్ గా ఆదరించడం మొదలుపెట్టారు.
రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ సినిమాలపైనే దృష్టి పెట్టి వరుస సినిమాలు చేస్తూ వస్తున్నారు. అంతేకాదు తెలుగు సినీ పరిశ్రమకి పెద్ద దిక్కుగా ఉంటూ ఇండస్ట్రీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. కరోనా సమయంలో టాలీవుడ్ లో అందరిని కలుపుకొనిపోయి.. ఛారిటీ ద్వారా సినీ కార్మికులకు అండగా ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి తన వంతు ప్రయత్నం చేశారు. అప్పటి నుంచి ఎన్నో మంచి పనులు చేస్తూ వస్తున్న చిరు కరోనా సెకండ్ వేవ్ లో తన మంచి మనసును చాటుకున్నారు.
మహమ్మారి కారణంగా అగమ్యగోచరంగా మారిన అనేకమంది వ్యక్తుల జీవితాలను చూసి చలించిన చిరంజీవి తనవంతు సాయం చేసి ఆదుకుంటున్నారు. ఇప్పటికే పలువురు నటీనటులకు, ఫోటో జర్నలిస్టులకు, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కి సేవలు అందించిన కుటుంబాలకు చేయూతనిచ్చారు. ఎవరు ఏ ఆపదలో వున్నా నేనున్నా అంటూ పలకరించే ఒక ఆపద్భాందవుడిగా మారిపోయారు చిరు. ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు కోల్పోతున్న వారిని చూసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలతో ఒకప్పుడు 'కొందరివాడు' అని కామెంట్స్ చేసిన వారితోనే ఇప్పుడు చిరు 'అందరివాడు' అనిపించుకుంటున్నారు.