వావ్‌!! మెగా లుక్‌ మామూలుగా లేదు

Update: 2016-05-29 06:58 GMT
నిన్న ఆల్ ఇండియా ఫిలిం ఎంప్లాయిస్‌ ఫెడరేషన్ వారి కార్యక్రమానికి మెగాస్టార్‌ చిరంజీవి చీఫ్‌ గెస్టుగా వచ్చారు. అయితే మొన్నటివరకు మనకు కనిపించిన చిరంజీవి.. ఇప్పుడు ఇక్కడ కనిపించిన చిరంజీవి.. వావ్‌.. లుక్కులో తేడా చూపిస్తూ పిచ్చ కిక్కిస్తున్నారు అంతే.

లైట్‌ బ్లూ కలర్‌ షర్టులో మెరిసిపోయిన చిరంజీవి.. ఈ కార్యక్రమంలో ఫ్యాషన్‌ స్టేట్మెంట్‌ కూడా ఇచ్చారు తెలుసా. కేవలం ఆయన షర్టు కలర్‌ మాత్రమే అలా ప్రశాంతమైన వినీలాకాశపు రంగులో లేదు.. ఆయన చేతికి పెట్టుకొచ్చిన వాచ్‌ డయల్‌ కలర్‌ కూడా సేమ్ రంగులో మెరిసింది. ఇక గ్రే కలర్‌ ఫ్యాంటు వేసుకున్న ఆయన.. కోటెడ్ మెరూన్-బ్రౌన్‌ షూ వేసుకుని దుమ్ములేపేశారు. అంతేకాదు.. తన షర్టు కలర్‌ అండ్‌ వాచ్‌ డయల్‌ కలర్‌ కు.. తన సాక్సుల కలర్‌ ను మ్యాచ్‌ చేసి.. పర్ఫెక్ట్ మ్యాన్లీ ఫ్యాషన్‌ అన్నట్లు సిగ్నల్‌ ఇచ్చారు. పైగా కాస్త స్లిమ్‌ కూడా అయ్యారేమో.. చూస్తే ఎవరికైనా గ్యాంగ్ లీడర్‌ లో రఫ్ఫాడిస్తా అంటూ డైలాగులు పేల్చిన మెగా హీరోనే గుర్తొస్తున్నాడు.

ఇలా లుక్కులతో ఊరించకుండా.. త్వరగా ఈయన 150వ సినిమాను మొదలెట్టేసి.. దానిని రిలీజ్ చేసేస్తే.. మెగా అభిమానులందరూ పండగ చేస్కుంటారు మరి.

Tags:    

Similar News