చెన్నై బ్యూటీ సాయి పల్లవి ట్యాలెంట్ గురించి చెప్పాల్సిన పనిలేదు.` ఫిదా` సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన బ్యూటీ తనదైన మార్క్ వేసింది. తొలి సినిమాతోనే బెస్ట్ పెర్పార్మర్ గా నిరూపించుకుంది. తెలంగాణ స్లాంగ్ లో అదరగొట్టి పల్లవి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ట్యాలెంట్ ఉంటే గ్లామర్ ఎలివేషన్స్ తో సంబంధం లేకుండానే నెట్టుకురావొచ్చిన నిరూపించింది. సెలక్టివ్ గా కెరీర్ ప్లాన్ చేసుకుని సక్సెస్ ఫుల్ గా పయనిస్తుంది. వీటన్నింటికి మించి..నటి అనే విషయాన్ని పక్కనబెట్టి చూస్తే ఆమె మంచి డాన్సర్. హీరోల్ని మించి శరీరాన్ని విల్లులా వంచి స్టెప్పులతో అదరగొట్టగలదు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తనతో డాన్స్ పరంగా పోటీ పడాలని వెయిట్ చేస్తున్నారు. ఇవన్ని సాయి పల్లవి క్రేజ్ ని మరింత రెట్టింపు చేసాయి. తాజాగా `లవ్ స్టోరీ` ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ ఆమెలో ఈ ప్రతిభను ఏకంగా ఆకాశానికే ఎత్తేసారు. సాయి పల్లవితో మెగాస్టార్ కూడా పోటీ పడాలని పబ్లిక్ గానే చెప్పారు. ఆమె గొప్ప డాన్సర్..తన పాత హీరోయిన్లను చిరంజీవి గుర్తు చేసుకున్నారు. నాతో అప్పట్లో రాధ..శ్రీదేవి.. పోటా పోటీగా డాన్సులు చేసేవారు. వాళ్లతో డాన్స్ చేస్తుంటే ఛాలెంజింగ్ గా ఉండేది. చైతు కూడా సాయిపల్లవితో డాన్సు చేస్తున్నప్పుడు అలాగే ఫీల్ అయి ఉంటాడు.
నిజానికి `ఫిదా` సినిమా చూసే ఆమె ఎవరో నాకు తెలియదు. అందులో ఆమె డాన్సు చూసి ఆశ్చర్యపోయాను. పల్లవి టైమింగ్..డాన్స్ ట్యాలెంట్..ఎనర్జీ చూసి షాక్ అయ్యాను. అదే సమయంలో వరుణ్ తేజ్ నా దగ్గరకు వచ్చి డాడి అని డాన్సు ఎలా చేసాను అని అడిగితే ఉండరా? నిన్ను చూడలేదు. సాయి పల్లవి చూస్తూ అలా ఉండిపోయాను అన్నాను. అంతగా ఆమె నన్ను ఆకట్టుకుంది. `ఆచార్య` సినిమాలో సాయి పల్లవి నా సోదరి పాత్రలో నటించాల్సి ఉంది. కానీ ఆమె నో చెప్పింది. అప్పుడు నేను చాలా హ్యాపీగా పీలయ్యాను. ఆమె నా సోదరి పాత్రలో నటించడం ఏంటి? సాయి పల్లవితో కలిసి డాన్సులో పోటీ పడాలనుకుంటున్నానని చిరంజీవి అనడం విశేషం. మెగాస్టార్ సాయి పల్లవిని అలా ఉద్దేశించి మాట్లాడటం తనకెంతో గౌరవంగా ఉందని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. మొత్తానికి సాయి పల్లవి మెగాస్టార్ ప్రశంసలే అందుకుంది. ఆయనే ఆఫర్ చేస్తున్నారు కాబట్టి? ఏదో ఒక సినిమా లో మెగాస్టార్ సరసన సాయి పల్లవి నటించడం ఖాయంగా కనిపిస్తుంది.