• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వీడియోలు చేసి పంపుతా:...

వీడియోలు చేసి పంపుతా: చిన్మయి ఓపెన్ ఆఫర్!

By - Tupaki Desk
Update: 2021-05-25 10:30 GMT
గాయనీ, డబ్బింగ్‌ కళాకారిణి చిన్మయి ఎప్పుడూ ఏదో విధంగా వార్తల్లో ఉంటూ వస్తున్నారు. చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల ఆరోపణలు చాలాకాలంగా వస్తున్నా, గాయనీ చిన్మయి గీత రచయిత వైరముత్తుపై చేసిన వేధింపుల ఆరోపణలు తరువాత మీటూ బహుళ ప్రాచుర్యం పొందిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈమె ఆరోపణలు చిత్ర పరిశ్రమలో పెద్ద కలకలానికే దారి తీశాయి.  ఆ తర్వాత  సౌత్‌ ఇండియన్‌ డబ్బింగ్‌ కళాకారుల యూనియన్‌ అధ్యక్షుడు రాధారవిపై గాయనీ చిన్మయి మీటూ ఆరోపణలు చేయడంతో ఆమెను డబ్బింగ్‌ కళాకారుల యూనియన్‌ నుంచి తొలగించారు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. న్యాయస్థానం ఆమెకు అనుకూలంగా తీర్పును ఇచ్చింది. అయితే దాని వలన ఆమెకు కలిసొచ్చేదేమీ లేదు.

పరిశ్రమలో పలుకుబడి ఉన్న పెద్దలపై ఆరోపణలు చేసిన చిన్మయి కెరీర్ కూడా కోల్పోవడం జరిగింది. దాంతో ఆమెకు పెద్దగా ఆదాయం కూడా లేదు. ఈ నేపధ్యంలో  చిన్మయి తాజా సోషల్ మీడియా పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ఆమె డబ్బులు ఇస్తే వీడియోలు చేసి పంపుతా ఉంటూ అభిమానులకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. తనకు ఆర్థిక వనరులు అవసరం అంటూ ఆమె ఓ పోస్ట్ పెట్టారు.

ఆ పోస్ట్ లో తనకు డబ్బు అర్జెంటుగా ఎందుకు కావాలో కారణం చెప్పారు.  ఆమె ముగ్గురు స్టూడెంట్స్ ని చదివించే బాధ్యత తీసుకున్నారట. ఆ ముగ్గురిలో ఒకరు మెడికల్ స్టూడెంట్ కూడా ఉన్నాడట. వాళ్ళ ఫీజులు చెల్లించడం కోసం చిన్మయికి డబ్బులు కావాలట. దీని కోసం ఆమె ఫ్యాన్స్ కి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. ఎవరైనా తమకు ఇష్టం వచ్చిన సాంగ్ చెబితే దానిని పాడుతూ వీడియో రికార్డు చేసి పంపుతా, అలాగే బర్త్ డే విషెస్ కూడా తెలియజేస్తాను. దానికి కొంత డబ్బులు ఇవ్వండి అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు.  మరి చిన్మయి ఆఫర్ కి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి మరి.
Tags:    
  • chinmayi sripada 
  • chinmayi sripada comments 
  • chinmayi sripada open offer 
  • chinmayi sripada social media 

Similar News

రామ్, జెనీలియా స్నేహం.. ఇప్పటికీ అదే అనుబంధం!

2026-11-08 06:32 GMT

బ్లాక్ శారీలో తృప్తి డిమ్రీ మెరుపులు.. దీపావళి పార్టీ లుక్ వైరల్!

2026-11-08 06:11 GMT

పెద్ద రహస్యం బయటపెడతాను అంటున్న స్టార్ హీరో..!

2026-11-08 06:01 GMT

దర్శకుడిగా రాపిడో డ్రైవర్.. అసలు విషయం చెప్పిన వెంకీ కుడుముల

2026-11-08 05:48 GMT

శ్రీలీల కీలక నిర్ణయం.. ఇక ఈ హీరోయిన్ జోరు ఆపేవాళ్ళు ఎవరు గురు..!

2026-11-08 05:46 GMT

రావణుడిగా ప్రభాస్…అంత ఘోర అవమానం తరువాత ఇది అవసరమా..!

2026-11-08 04:55 GMT

మణిరత్నం.. చిరంజీవి..ఓ తమిళ దళపతి..!

2026-11-08 04:54 GMT

రామాయణం తీస్తూ రాముడినే మర్చిపోయారా?

2026-11-08 04:54 GMT

9వ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్!

2026-11-08 04:43 GMT

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

Copyright @2026

Powered by Blink CMS