• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అఖిల్‌ సినిమాతో సమంత...

అఖిల్‌ సినిమాతో సమంత 'ఆత్మ' వెండితెర ఎంట్

By - Tupaki Desk
Update: 2021-09-10 05:35 GMT
సమంత చేసిన ఎన్నో పాత్రలకు ప్రాణం పోసిన చిన్మయి వెండి తెర అరంగేట్రంకు సిద్దం అయ్యింది. ఇప్పటి వరకు తెర వెనుక నుండి ఇతర హీరోయిన్స్ కు తన వాయిస్ ను వినిపించిన స్టార్ సింగర్ చిన్మయి శ్రీపాద ఇప్పుడు వెండి తెరపై కనిపించబోతుంది. నేడు చిన్మయి పుట్టిన రోజు. ఈ సందర్బంగా ఆమె వెండి తెర అరంగేట్రం చేయబోతున్న మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్ సినిమా మేకర్స్ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్టుగా ఎన్నో పురష్కారాలు గౌరవాలు దక్కించుకున్న చిన్మయి శ్రీపాద మొదటి సారి నటిగా ఎంట్రీ ఇవ్వబోతున్న నేపథ్యంలో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అఖిల్‌ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్ కు సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే. ఈ సినిమా ఇప్పటికే విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఈ సినిమా విడుదలకు రంగం సిద్దం అయ్యింది. దసరాకు ఈ సినిమాను విడుదల చేస్తారని భావిస్తున్నారు. ఈ సమయంలో సినిమాకు క్రేజ్‌ పెంచే విధంగా సినిమాలో చిన్మయి నటిస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. చిన్మయి ఖచ్చితంగా సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

సమంత పాత్రలకు అద్బుతమైన డబ్బింగ్‌ చెప్పడం ద్వారా చిన్మయిని సమంత ఆత్మ అంటూ అంతా పిలుస్తూ ఉంటారు. సమంత కు సరిగ్గా సూట్ అయ్యేలా చిన్మయి వాయిస్‌ చెబుతుంది. కనుక ఎక్కువ శాతం సమంత సినిమాలకు చిన్మయితో డబ్బింగ్‌ చెప్పించడం జరిగింది. డబ్బింగ్‌ ఆర్టిస్టుగా సింగర్ గా చాలా పాపులర్ అయిన ఈమె తమిళంలో మాత్రం ప్రముఖులపై మీటూ వ్యాఖ్యలు చేయడం వల్ల వివాదంతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇప్పుడిప్పుడే మళ్లీ ఈమె కెరీర్‌ గాడిన పడుతుంది. ఈ సమయంలో ఈమెకు భారీగా ఆఫర్‌ దక్కడంతో నటిగా బిజీ అయ్యే అవకాశాలు ఉంటాయని అంటున్నాయి.


Tags:    
  • Chinmayi 
  • Silver Screen 
  • Akhil Cinema 

Similar News

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

Copyright @2026

Powered by Blink CMS