• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  యువతిని మోసగించిన రచయితపై...

యువతిని మోసగించిన రచయితపై కేసు!

By - Tupaki Desk
Update: 2019-06-01 07:26 GMT
సినిమా ఇండస్ట్రీకి చెందిన యువ రచయిత ఓ అమ్మాయిని ప్రేమించి.. పెళ్లి చేసుకొని మోసం చేసిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో నివసించే యర్రంశెట్టి రమణగౌతం (28) బుల్లితెరతోపాటు వెండితెరకు కథలు రాస్తూ ఫిలింనగర్ లో ఆరేళ్లుగా రచయితగా జీవిస్తుండేవాడని పోలీసులు తెలిపారు.

ఇతడికి హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 ఎన్జీబీనగర్ లో నివసించే యువతి (23)తో పరిచయం అయ్యిందని వివరించారు.. సినిమాల మీద ప్రేమతో ఆ యువతి స్టూడియోల చుట్టూ తిరుగుతుండగా.. రమణతో పరిచయం ఏర్పడి అది ప్రేమకు దారితీసిందన్నారు. సినిమాల్లో చాన్స్ ఇప్పిస్తానని రమణ .. సదురు యువతిని నమ్మించాడని.. 2016లో మొదలైన వీరి ప్రేమ ప్రయాణం ఆ తరువాత సహజీవనానికి దారితీసిందని పేర్కొన్నారు.

యువతికి ఉన్నత ఉద్యోగ అవకాశం రావడంతో దుబాయ్, సింగపూర్, బెహ్రయిన్ దేశాలకు వెళ్లిందని పోలీసులు తెలిపారు. అక్కడ సంపాదించిన డబ్బుని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన రమణకు పంపిందని.. 2017లో ఇద్దరూ ఉంగరాలు కూడా మార్చుకున్నట్టు వివరించారు. అయితే ఇటీవల ఆమె పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతో రమణ ఒప్పుకోలేదని పోలీసులు పేర్కొన్నారు.

రమణ పెళ్లికి నిరాకరించాడని సదురు యువతి ఆత్మహత్యాయత్నం చేసిందని.. సమాచారం అందుకున్న పోలీసులు రమణను స్టేషన్ కు పిలిపించి పెళ్లి చేసుకోమని సూచించామని తెలిపారు. దీంతో అదేరోజు రాత్రి అయిష్టంగానే రమణ ఓ గుడిలో సదురు యువతికి తాళి కట్టాడని.. సిగరేట్ తాగి వస్తానని చెప్పి అటు నుంచి అటే బయటకు వెళ్లి ఉడాయించాడని తెలిపారు.

అలా మొదటి రాత్రి రోజే తెల్లవారుజామున ఫోన్ చేసి నువ్ నాకు వద్దు అంటూ విడాకులు తీసుకుందామని రమణ సదురు యువతికి షాక్ ఇచ్చాడని పోలీసులు వివరించారు.. దీంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నారు. మోసగించిన రమణపై చర్యలు తీసుకోవాలని కోరిందని.. ఈ మేరకు  రమణపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

    

Tags:    
  • Cheating Case 
  • Movie Writer 
  • Ramana Gautham 
  • Latest News 

Similar News

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

Copyright @2026

Powered by Blink CMS