• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పూరి 'రొమాంటిక్' డైలాగులు...

పూరి 'రొమాంటిక్' డైలాగులు హైలైట్ : చార్మీ

By - Tupaki Desk
Update: 2021-10-23 03:07 GMT
ఈ మధ్య కాలంలోనే ఫస్టు పోస్టర్ తోనే యూత్ ను విపరీతంగా ఆకట్టుకున్న సినిమా ఏదైనా ఉందంటే, అది 'రొమాంటిక్' అనే చెప్పాలి. ఆ ఊపులోనే ఈ సినిమా థియేటర్లకు వచ్చేసేది. కానీ కరోనా కారణంగా పరిస్థితులు అనుకూలించకపోవడంతో, సరైన విడుదల సమయం కోసం ఎదురుచూస్తూ వచ్చింది. ఇక ఇప్పుడు పరిస్థితులు చాలావరకూ సర్దుకున్నాయి. దసరా సమయంలో థియేటర్లన్నీ కూడా దడదడలాడాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకులను పలకరించడానికి ఉత్సాహపడుతోంది.     

'రొమాంటిక్' సినిమా నుంచి ప్రభాస్ ట్రైలర్ వదిలిన దగ్గర నుంచి ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా విడుదల తేదీ కోసం అంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అలాంటి ఈ సినిమా ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల  ముందుకు రానుంది. ఆకాశ్ పూరి - కేతిక శర్మ జంటగా నటించిన ఈ సినిమాను, పూరితో కలిసి చార్మీ నిర్మించారు. విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా, నిన్నరాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది. ఈ వేడుకలో చార్మీ మాట్లాడారు.

"లైగర్ విజయ్ దేవరకొండకి చాలా థ్యాంక్స్ .. ఇక్కడికి వచ్చినందుకు. త్రీ హవర్స్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినందుకు. మళ్లీ త్రీ హవర్స్ ఇక్కడి నుంచి అక్కడికి తిరిగి వెళ్లాలి .. నాట్ ఏ జోక్. నాకు తెలిసి విజయ్ దేవరకొండకి లాంగ్ డ్రైవ్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. షూటింగు పక్కనే హోటల్ ఉండాలి .. హోటల్ పక్కనే షూటింగు లొకేషన్ ఉండాలి. అలాంటి ఆయన 'రొమాంటిక్' కోసం .. నా కోసం .. పూరి గారి కోసం .. ఫ్యాన్స్ కోసం ఇంత దూరం వచ్చారు. అందుకు నేను ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నాను.

చెప్పుకోవలసిన పేర్లు చాలానే ఉన్నాయి. ఇప్పుడు అంత టైమ్ తీసుకుంటే మంచిది కాదు. ఆకాశ్ ..  కేతిక .. రమ్య .. దేవయాని .. ఉత్తేజ్ ఎవ్రీవన్ అందరూ చాలా బాగా చేశారు. సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. 'రొమాంటిక్'లో పూరిగారు రాసిన డైలాగులు మీరు మళ్లీ మళ్లీ చెప్పుకుంటారు. ఈ ఫంక్షన్ ఇక్కడ ఇంత గొప్పగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు  తెలియజేస్తున్నాను. వరంగల్ కి మొన్న వచ్చాము .. ఇప్పుడు వచ్చాము .. మళ్లీ వస్తాము .. మళ్లీ మళ్లీ వస్తాము మీ ముందుకు" అంటూ ముగించారు.      
Tags:    
  • Charmy Kaur 
  • Charmy Kaur comments 
  • Romantic 
  • KetikaSharma 
  • Purijagannadh 
  • SunilKashyap 
  • Akash Puri 
  • Puri Connects 
  • Romantic trailer 
  • RomanticTrailer 

Similar News

చిరు మాట ఇచ్చారు సరే.. వెంకీకి మళ్ళీ మెగా ఛాన్స్ దక్కేనా?

2026-11-10 18:30 GMT

ISKCON వ్యవస్థాపక ఆచార్యులు శ్రీ‌ల ప్ర‌భుపాద్‌ బ‌యోపిక్..హోంబలే సంచలనం!

2026-11-10 17:30 GMT

తమిళ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాకు ఎలివేషన్

2026-11-10 16:30 GMT

డైరెక్టర్ టు హీరో.. భాషతోపాటు క్యారెక్టర్ మార్చిన తరుణ్ భాస్కర్.. వర్కౌట్ అయ్యేనా?

2026-11-10 15:30 GMT

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

మండే రోజు రామాయణం మంటలు

2026-11-10 14:11 GMT

వాళ్లు 1% మాత్రమే... సినిమాను ఏం చేయలేరు!

2026-11-10 13:30 GMT

ట్రెడిషనల్ లుక్ లో మెరిసిన నిహారిక!

2026-11-10 12:54 GMT

పాత బాకీల పంచాయితీ.. ఆ డైరెక్టర్ సినిమా రిలీజ్ కష్టమేనా?

2026-11-10 12:54 GMT

'ఇంకా ఏం అనుకోలేదు' మూవీ.. మెస్మరైజ్ చేస్తున్న ఫస్ట్ సింగిల్!

2026-11-10 12:51 GMT

రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్.. కర్మఫలం తప్పదంటూ..

2026-11-10 12:49 GMT

'ఇరుముడి' కావేరి పెళ్లి పీటలు ఎక్కనుందా?

2026-11-10 12:49 GMT

Copyright @2026

Powered by Blink CMS