ఏదో ఒక రోల్ కావాలంటున్న ఛార్మి

Update: 2017-03-03 09:56 GMT
మొన్న ''రోగ్'' సినిమా ట్రైలర్ లాంచ్ లో తళుక్కున మెరిసిన సీనియర్ హీరోయిన్ ఛార్మి.. ఎందుకో పెద్దగా ఫోటోలకు ఫోజులు కూడా ఇవ్వలేదు. రోగ్ సినిమా హీరోయిన్లను మాత్రమే క్లిక్ చేసుకోండి.. నన్ను తీయాల్సిన అవసరం లేదని చెప్పేసింది. అయితే అమ్మడు ఇప్పుడు పూరి జగన్ క్యాంపులో ''పూరి కనక్ట్స్'' కంపెనీను చూసుకోవడం మాత్రమే కాకుండా.. ఇతర పాత్రలు కూడా కావాలని అంటోందట. ఇంతకీ ఆ పాత్రలేంటనేగా.. పదండి చూద్దాం.

గతంలో పూరి జగన్ తీసిన జ్యోతిలక్ష్మి సినిమాకు కో-ప్రొడ్యూసర్ గా వర్క్ చేసిన ఛార్మి.. ఇప్పుడు పూరి తదుపరి తీయబోయే పెద్ద సినిమాల్లో కూడా ఏదో ఒక రోల్ లో పనిచేయడానికి సిద్దంగా ఉందట. ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్ అనో.. క్రియేటివ్ ప్రొడ్యూసర్ అనో.. క్యాస్టింగ్ హెడ్ అనో.. ఇలా ఏదో ఒక రోల్ ఇవ్వండి పూరి సార్ అనడంతో.. మనోడు కూడా ఆమెను త్వరలో నందమూరి బాలకృష్ణ హీరోగా తీయబోయే సినిమా మేకింగ్ లో ఒక కీలకపాత్రను అప్పజెప్పుద్దాం అనే ఫిక్సయ్యాడట.

అంతేకాకుండా.. వీలైతే పూరి తదుపరి సినిమాల్లో కావాలంటే ఐటెం సాంగ్స్ వంటివి చేయడానికి కూడా ఛార్మి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. హీరోయిన్ గా తన కెరియర్ ను క్లోజ్ చేసుకుని.. ఇలా తదుపరి పాత్రలను పోషించడానికి ఛార్మి సిద్దపడిన తీరును చూస్తే మాత్రం.. ఆమెను పొగడాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News