చిన్నదాని స్టెప్పులకు టిక్ టాక్ షేక్.. రికార్డులు బద్దలు

Update: 2020-11-24 08:30 GMT
టిక్​టాక్​ మనదేశంలో నిషేధించినా ప్రపంచవ్యాప్తంగా దీని క్రేజ్​ ఏమాత్రం తగ్గలేదు. టిక్​టాక్​ ఎంతో మంది యువతకు ఎంటర్​టెయిన్​మెంట్ ఇవ్వడమే కాదు..! సెలబ్రిటీలను తయారుచేసింది. యువతకు ఉపాధి కల్పించింది. ఇప్పటికే పలుదేశాల్లో యువత టిక్​టాక్​ను వాడుతున్నారు. వీడియోలు చేసుకుంటూ ఉపాధి పొందేవాళ్లు ఉన్నారు. అయితే ఈ టిక్​టాక్​ మన దేశంలో చాలామంది కొంపలు కూడా కూల్చింది. కొందరి ఉద్యోగాలు పోగొట్టింది. ప్రభుత్వ, ప్రైవేట్​ ఉద్యోగులు తమ కార్యాలయాల్లో పనులు చేసుకోకుండా ఈ టిక్​టాక్​కు బానిసలుగా మారి తమ ఉద్యోగాలు కోల్పోయారు. టిక్​టాక్​లో ఫాలోవర్స్​ పెరగలేదని ఆత్మహత్యలు చేసుకున్నవారు ఉన్నారు.

అయితే టిక్​టాక్​లో ఉన్న మంచి చెడులను పక్కనపెడితే అమెరికాకు చెందిన ఓ పదహారేళ్ల పిల్ల స్టార్​గా మారిపోయింది. ఆమె టిక్ టాక్ లో 100 మిలియన్ (10 కోట్లు) ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నది. చార్లీ డీ అమీలియో అనే 16 ఏళ్ల అమ్మాయి.. టిక్‌టాక్‌లో తొలిసారిగా 10 కోట్ల మంది ఫాలోవర్స్‌ మార్క్‌ను చేరుకుంది. ఇప్పటివరకు 100 మిలియన్ల ఫాలోవర్స్​ ను పెంచుకొని రికార్డ్​ సృష్టించింది. అయితే ఆమె 2019లోనే టిక్​టాక్​లో వీడియోలు స్టార్ట్​చేసి ఏడాది తిరక్కుండానే ఈ ఘనత సాధించింది. హాలీవుడ్ హీరో విల్‌స్మిత్‌ కంటే రెండింతలు ఫాలోవర్స్​ను పెంచుకొని రికార్డు సృష్టించింది. అయితే ఆమె పెడుతున్న వీడియోలు జనాలను విశేషంగా ఆకట్టకుంటున్నాయి. మనదేశంలో టిక్​టాక్​ బ్యాన్​ అయినా ప్రపంచదేశాల్లో మాత్రం దానికి క్రేజ్​ తగ్గడం లేదు.

చైనాకు చెందిన ఈ యాప్​ ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోయింది. చాలా తక్కువకాలంలోనే యువతను ఆకర్షించింది. చైనా యాప్​ కావడం.. ఈ యాప్​తో యువత తప్పుదారి పడుతుండటంతో దీన్ని మనదేశంలో బ్యాన్​ చేశారు. అయితే టిక్​టాక్​ మేనేజ్​మెంట్ను మార్చుకొని తిరిగి ఇండియాలోకి అడుగుపెట్టబోతున్నదంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఇంతవరకు అటువంటి అధికారిక ప్రకటన ఏదీ బయటకు రాలేదు.
Tags:    

Similar News