చరణ్‌.. బన్నీలను స్టూడెంట్‌ లీడర్‌ లను చేయబోతున్న కొరటాల

Update: 2020-12-06 12:30 GMT
ప్రస్తుతం టాలీవుడ్‌ లో టాప్‌ డైరెక్టర్స్‌ లో ఒకరు కొరటాల శివ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాలను దక్కించుకున్నాయి. ప్రస్తుం కొరటాల 'ఆచార్య' సినిమాను చిరంజీవితో చేస్తున్నాడు. నక్సలైట్‌ గా మారిన ప్రొఫెసర్‌ పాత్రలో చిరంజీవి కనిపిస్తాడనే సమాచారం అందుతోంది.

ఇదే సమయంలో చరణ్‌ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఆచార్యలో చరణ్‌ పాత్ర గెస్ట్‌ రోల్‌ కు ఎక్కువ ఫుల్‌ రోల్‌ కు తక్కువ అన్నట్లుగా ఉంటుందట. ఆచార్య కోసం చరణ్‌ స్టూడెంట్‌ లీడర్‌ గా కనిపిస్తాడనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్‌ జరుగుతుంది. త్వరలోనే చరణ్‌ కూడా షూటింగ్‌ లో జాయిన్‌ అవ్వబోతున్నాడు.

ఆచార్య తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహించబోతున్న సినిమా ఇప్పటికే కన్ఫర్మ్‌ అయ్యింది. బన్నీ హీరోగా కొరటాల మూవీ అధికారిక ప్రకటన వచ్చింది. సినిమా నేపథ్యం ఏంటీ అనే విషయమై కూడా మెగా వర్గాల ద్వారా అనధికారిక సమాచారం అందింది. బన్నీ తనతదుపరి సినిమాలో హీరోను స్టూడెంట్‌ లీడర్‌ గా చూపించబోతున్నాడట. బన్నీని ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో చూశాం. మొదటి సారి స్టూడెంట్‌ లీడర్‌ గా చూపించబోతున్నాడు.

ఈ సినిమా పూర్తిగా స్టూడెంట్‌ రాజకీయాల నేపథ్యంలో సాగుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. భారీ ఎత్తున అంచనాలున్న కొరటాల.. బన్నీల మూవీ వచ్చే సమ్మర్‌ తర్వాత ప్రారంభం అవ్వబోతుంది. ప్రారంభం కాకుండానే సినిమాపై జనాల్లో ఆసక్తి నెలకొంది. ఆచార్యలో చరణ్‌ మరియు బన్నీ తదుపరి సినిమాల్లో స్టూడెంట్‌ లీడర్‌ లుగా కనిపించబోతున్న నేపథ్యంలో మెగా ఫ్యాన్స్‌ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Tags:    

Similar News