'RC15'లో సీఎంగా చరణ్..?

Update: 2021-03-27 15:30 GMT
క్రియేటివ్ జీనియస్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ కథానాయకుడిగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సంస్థ 50వ చిత్రంగా.. చరణ్ కెరీర్ లో 15వ చిత్రంగా ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనుంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో నిర్మాతలు దిల్‌ రాజు - శిరీష్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే 'RC15' సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇది ఏ నేపథ్యంలో ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది.

తాజాగా ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఇదొక పొలిటికల్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. అంతేకాకుండా ఇందులో రామ్ చరణ్ యంగ్ చీఫ్ మినిస్టర్ గా కనిపిస్తారని టాక్ నడుస్తోంది. శంకర్ తరహాలో సందేశాత్మక అంశాలతో భారీ స్థాయిలో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ మూవీ రూపొందనుందట. మరి చరణ్ ముఖ్యమంత్రిగా నటిస్తున్నాడా లేదా అనేది తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.

ఇదిలావుండగా 'RC15' లో రామ్ చరణ్ కు జోడీగా మరోసారి బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ నటించనుందని మరో న్యూస్ వస్తోంది. కియరా ఇంతకముందు చరణ్‌ తో కలిసి ‘వినయ విధేయ రామ’ సినిమాలో సందడి చేసింది. అలానే ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చరణ్ 'ఆర్.ఆర్.ఆర్' మరియు 'ఆచార్య' సినిమాల షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత జూన్‌ లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.




Tags:    

Similar News