విలక్షణమైన విలనిజం పేరే .. రావు రమేశ్

Update: 2021-08-09 02:37 GMT
తెలుగు తెరపై చాలామంది ప్రతినాయక పాత్రలను పోషించి మెప్పించారు .. ఎవరి ప్రత్యేకత వారిది. అలాంటి ప్రతినాయకులలో రావు గోపాలరావు శైలి విభిన్నం .. విలక్షణం. కేవలం డైలాగ్ డెలివరీలో ఆయన తన విలనిజాన్ని పండించేవారు. అలాంటి రావు గోపాలరావు వారసుడిగా రావు రమేశ్ నటన వైపుకు వచ్చారు. రావు రమేశ్ ఆర్టిస్టుగా ఒక స్థాయికి వచ్చేవరకూ ఆయన రావు గోపాలరావు తనయుడు అనే విషయం చాలామందికి తెలియదు. ఆ విషయాన్ని  చెప్పుకుని అవకాశాలు రాబట్టుకోవడానికి ఆయన ప్రయత్నించనూ లేదు.

రావు రమేశ్ కాస్త లేటుగానే ఇండస్ట్రీకి వచ్చారు. అందుకు కారణం నటన వైపుకు రావాలని మొదటి నుంచి ఆయన అనుకోకపోవడమే. ఫొటోగ్రఫీ పట్ల ఆయనకి ఎక్కువ ఆసక్తి ఉండేది. అందువలన ఆ దిశగా ఆయన ఉత్సాహాన్ని చూపుతుండేవారు. అయితే తల్లికి మాత్రం ఆయనను నటుడిగా చూడాలని ఉండేది. దాంతో అవకాశాలు ఎవరినీ అడగడం అలవాటు లేని రావు రమేశ్, తన సన్నిహితులు కోరడం వలన టీవీ సీరియల్స్ వైపు వెళ్లారు. అక్కడ ఆయన తనదైన ముద్ర వేయడంతో మంచి పేరు వచ్చింది.
Read more!

అలా టీవీ సీరియల్స్ కారణంగా ఆయనకి సినిమాల్లో అవకాశాలు రావడం మొదలైంది. తొలినాళ్లలో ఆయన చేసిన సినిమాల్లో 'కొత్త బంగారు లోకం' ఒకటి. ఈ సినిమాలో 'జీవితాన్ని డిఫరెంట్ యాంగిల్లో చూడటానికి ట్రై చేయండమ్మా' అంటూ స్టూడెంట్స్ కి క్లాస్ పీకే లెక్చరర్ పాత్ర ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక 'పిల్ల జమీందార్'లో ఆయన పోషించిన మిలట్రీ రాజన్న పాత్రను ఇప్పటికీ యూత్ మరిచిపోలేదు. 'జులాయి' సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్ర కూడా ఆయన క్రేజ్ ను పెంచింది.

'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో 'ప్రతి దానికి ఒక విజన్ ఉండాలి' అంటూ అవతల వారిని తేలికగా తీసిపారేసే హీరోయిన్ తండ్రి పాత్రలో ఆయన చేసిన హాడావిడి అంతా ఇంతాకాదు. 'ఓ ప్లానింగ్ .. ఓ  పద్ధతి .. ఓ విజన్',  'వాడినలా వదిలేయకండ్రా .. ఎవరికైనా చూపించండ్రా' అంటూ తనదైన స్టైల్లో డైలాగ్స్ చెబుతూ ఆ పాతకి ఒక నిండుదనాన్ని తీసుకొచ్చాడు. ఇక 'కార్తికేయ' .. 'గీతాంజలి' సినిమాల్లో ఆయన చేసిన విలన్ పాత్రలు ఆ సినిమాల విజయంలో కీలకమైన పాత్రను పోషించాయి.
4

'బెంగాల్ టైగర్'లో 'హోమ్ మినిష్టర్ నాగప్పగా డిఫరెంట్ లుక్ తో .. కొత్త బాడీ లాంగ్వేజ్ తో ఆయన కనిస్తాడు. ఈ సినిమాలో ఆయన నటన హైలైట్ గా నిలిచింది. ఇక అంతవరకూ ఆయన చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా ఆయన 'సరిలేరు నీ కెవ్వరు' సినిమాలో కనిపిస్తారు. కథానాయిక తండ్రిగా ట్రైన్ ఎపిసోడ్ లో ఆయన పండించిన కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. ఇలా ఆయన విలన్ గా .. కామెడీ విలన్ గా .. ఎమోషన్స్ తో కూడిన తండ్రిగా ఆయన ఆయా పాత్రలపై తనదైన ముద్రవేశారు. ప్రస్తుతం ఆయన చేతిలో 'టక్ జగదీష్' .. 'పుష్ప' .. 'మహాసముద్రం' వంటి సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలు ఆయన స్థాయిని మరింత పెంచుతాయనే అనిపిస్తోంది.
Tags:    

Similar News