న‌గ్న ఫోటోల‌తో ప్ర‌చార‌మా? నాస్టీ అంటూ తిట్టేసింది!

Update: 2022-08-07 03:22 GMT
బిగ్ బాస్ సంచ‌ల‌నం ఉర్ఫీ జావెద్ వ‌ర్సెస్ న‌టి చాహ‌త్ ల న‌డుమ ఆన్ లైన్ తిట్ల పురాణం మ‌రింత‌ ర‌చ్చ‌కెక్కుతోంది. ఆరంభం నెమ్మ‌దిగా మొద‌లైన సోష‌ల్ మీడియా గొడవ కాస్తా ప‌రాకాష్ట‌కు చేరుకుంటోంది. ఒక‌రిపై ఒక‌రు ఛీద‌రించుకుంటూ ఈ ముద్దుగుమ్మ‌లు ఇప్పుడు పెళ్లిళ్ల గురించి ఇత‌ర వ్య‌క్తిగత జీవితాల గురించి ర‌చ్చ చేసేశారు.

ఒంటిపై నూలుపోగు అయినా నిలువ‌ని ఉర్ఫీ జావేద్ ఫోటోల‌ను షేర్ చేస్తూ ..న‌టి చాహత్ ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో ఘాటుగా స్పందించింది. ``దీన్ని ఎవరు ధరిస్తారు? .. వీధుల్లో?`` అంటూ ఉర్ఫీ అర్థ‌న‌గ్న గెట‌ప్ ని ఎండ‌గ‌ట్టింది. నా ఉద్దేశ్యం లో ఎవరైనా బట్టలు తీసివేస్తే మీడియా వాళ్లు వారిని సెలబ్రిటీని చేస్తారా? భారతీయ మీడియా అంత బలహీనంగా ఉందా? ఈ చౌకైన ప్రచారానికి  మీడియాను కొనుగోలు చేయడం సులభం. ఈ చౌకర‌కం ప్రదర్శనను మీరు మా తరానికి ప్రచారం చేస్తున్నారు. ఎవరైనా గుర్తింపు కోసం డబ్బు చెల్లించి ఏదైనా చేస్తారా? లేదా నగ్నత్వంతో  ప్ర‌చారం చేసుకుంటారా? ఇది నాస్టీ.. చాలా విచారకరం!! దేవుడు మీకు కొంత జ్ఞానాన్ని అనుగ్రహించాలి..`` అని తీవ్ర‌మైన ప‌ద‌జాలంతో విరుచుక‌ప‌డింది.

అయితే దీనికి ఉర్ఫీ వెంట‌నే కౌంట‌ర్ ఎటాక్ చేసింది. ``కనీసం నేను అనుచరుల(సోష‌ల్ మీడియాలో)ను కూడా కొనుగోలు చేయను! మీరు మీ ఇంట్లో ఉండి ప‌ని చేస్తుంటే.. నేను ఇంటర్వ్యూ కోసం ఇక్కడ ఉన్నాను. నేను మీకు ఎలాంటి సంబంధం లేని ఇంటర్వ్యూ కోసం దుస్తులు ధరించాను. డ‌బ్బులు చెల్లించిన తర్వాత కూడా వారు మిమ్మల్ని మీడియా కవర్ చేయలేదని అసూయపడుతున్నారు. చాహ‌త్ ఖ‌న్నా ఈ భూమిపై ఎవరైనా ఏం చేసినా అది మీకు సంబంధించినది కాదు. మీరు రణవీర్ సింగ్ విష‌యంలో ఇలాంటి కథనాన్ని ఎందుకు అప్ లోడ్ చేయలేదు? మీ కపటత్వాన్ని ఇది చూపిస్తుంది. మీ రెండు విడాకుల వ్య‌వ‌హారంలో నేను మీపై తీర్పు చెప్పలేదు.. మీరు యువకులతో డేటింగ్ చేస్తే నేను ఎందుకు తీర్పు చెప్పాలి?`` అని కౌంట‌ర్ వేసింది.

ఛాహత్ కెమెరాకు తన బేర్ బ్యాక్ చూపిస్తున్న ఓ ఫోటోని కూడా ఉర్ఫీ  షేర్ చేసింది. ``కాబట్టి ప్రపంచం మొత్తం చూసేలా ఇలాంటి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి మీకు అనుమతి ఉందా? సోషల్ మీడియా పే తో అస్లీ లాగ్ నహీ హోతే నా? మీరు నాపై కురుస్తున్న ప్రేమాభిమానాల‌ను చూసి అసూయపడుతున్నారు. నువ్వు రౌడీవి కూడా. మీ కూతురి పట్ల నాకు బాధగా ఉంది. వారికి ఎలాంటి తల్లి ఉంది. ష్*ట్`` అని రాసింది. ``కనీసం నేను మీలాగా మాజీ భర్తల భరణంతో జీవించకుండా స్వ‌యంగా డబ్బు సంపాదిస్తాను! @చహత్ ఖన్నా మీరు మీ జీవితాన్ని ఎలా ప్రేమిస్తున్నారో అంచనా వేయడానికి నేను మీ వద్దకు రావడం లేదు. ఈ ఆంటీ (ఛాహ‌త్ కూడా)లు నాకు వ్యతిరేకంగా ఏం చేయాల‌నుకుంటున్నారో!!`` అంటూ ఉర్ఫీ త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డింది.

ఉర్ఫీ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా చాహ‌త్ మ‌రో పోస్ట్ ను షేర్ చేసారు. ``నేను ఈ డ్రామాలో భాగం కానవసరం లేదు.. కానీ నా అనుచరులకు తెలియజేయడం చాలా అవసరం.. ప్రజలు మాట్లాడతారు..కొంద‌రు చాలా మొరగుతారు.. కానీ నేను ఇక్కడికి వచ్చి ఇలాంటి జీవనశైలిని సాధించడానికి చాలా కష్టపడ‌డం నా వారికి తెలుసు. భరణం కాదు... ద‌య‌చేసి మాట్లాడే ముందు రికార్డులు చెక్ చేసుకోండి. ఒక్క పైసా కూడా తీసుకోలేదు.. అలా చేస్తే నా విడాకులు కూడా ఈజీగా టార్గెట్ అయ్యేది... ఇది అందరికీ తెలుసు. కానీ ఒక క్లాస్ స్వ‌భావం ఉన్న వ్యక్తులు ఎప్పటికీ అలా చేయరు. నేను క్లాస్ లెస్ వ్యక్తుల నుండి లేదా చెల్లింపు మీడియా నుండి మంచి క్లాస్ ని ఆశించడం లేదు. ఏ బాకీ జిస్కో జో అచా లగ్తా హై లిఖో.. మేరా క్యా (మీకు ఏది కావాలంటే అది రాయండి..దాంతో నాకు ఏమీ కాదు) అని అంది. మొత్తానికి ఇద్ద‌రి న‌డుమా గొడవ ముదిరిపాకాన పడింది.

ఉర్ఫీ జావేద్ గతేడాది బిగ్ బాస్ OTTలో కనిపించింది. ఇంత‌లోనే బోలెడంత పాపుల‌రైంది. ఈ బ్యూటీ తరచుగా రణవీర్ సింగ్ ... మసాబా గుప్తా డిజైన్స్ త‌ర‌హాలో అసహ్యకరమైన దుస్తులలో కనిపిస్తుంది. చాహత్ ఒక టీవీ నటి. బడే అచ్ఛే లాగ్తే హైలో నటించింది.
Tags:    

Similar News