విక్ట‌రీకి ముందే ఇలా రౌండ‌ప్ చేశారు!

Update: 2019-05-24 04:28 GMT
గెలిస్తే వ‌చ్చే కిక్కే వేరు. గెలిచిన నాయ‌కుడు ఆ కిక్ ని ఎంజాయ్ చేస్తుంటే .. చుట్టూ జ‌నం మూగి శుభాకాంక్ష‌లు చెబుతుంటే.. ఎలా ఉంటుందో ఊహించ‌న‌ల‌వి కానిది. ప్ర‌స్తుతం అలాంటి అరుదైన మూవ్ మెంట్ ని ఆస్వాధిస్తున్నారు భారత ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ. భాజ‌పా-ఎన్డీయే అల‌యెన్స్ కి గ్రాండ్ విక్ట‌రీ ద‌క్క‌డంతో మోదీ ఆనందానికి అవ‌ధులే లేకుండా పోయాయి. ఈ స‌క్సెస్ ని పీక్స్ లో సెల‌బ్రేట్ చేసుకుంటున్నారాయ‌న‌.

ప‌నిలో ప‌నిగా అత‌డి చుట్టూ బాలీవుడ్ సెల‌బ్రిటీలు మూగేశారు. శుభాకాంక్ష‌ల‌తో త‌డిపి ముద్ద చేశారు. ఆ అరుదైన స‌న్నివేశానికి సంబంధించిన ఫోటో ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అవుతోంది. ఈ గుంపులో ప‌లువురు బాలీవుడ్ న‌టీన‌టులు.. ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఉన్నారు. చాక్లెట్ బోయ్ వ‌రుణ్ ధావ‌న్.. హీరో సిద్ధార్థ్ మ‌ల్హోత్రా.. ఆలియా భ‌ట్.. ర‌ణ‌బీర్ క‌పూర్.. ర‌ణ‌వీర్ సింగ్.. క‌ర‌ణ్ జోహార్.. రోహిత్ శెట్టి..  భూమి ఫెడ్నేక‌ర్.. రాజ్ కుమార్ రావ్.. విక్కీ కౌశ‌ల్.. ఏక్తా క‌పూర్ త‌దిత‌రులు శుభాకాంక్ష‌లు చెప్పి పీఎంతో ఫోటో దిగారు. ఇక టాలీవుడ్ నుంచి పీఎం మోదీకి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తాయి. కింగ్ నాగార్జున‌.. సుధీర్ బాబు లాంటి హీరోలు మోదీకి సామాజిక మాధ్య‌మాల ద్వారా విషెస్ తెలిపారు. బాలీవుడ్ కండ‌ల హీరో స‌ల్మాన్ ఖాన్ మోదీకి శుభాకాంక్ష‌లు తెలిపారు. ``మోదీజీకి శుభాకాంక్ష‌లు. ప్ర‌జాస్వామ్యం గెలిచింది. మ‌న దేశాన్ని ఇంకా గొప్ప‌గా ముందుకు న‌డిపిస్తార‌ని ఆశిస్తున్నాను`` అంటూ కింగ్ నాగార్జున ట్వీట్ చేశారు.

ఆస‌క్తిక‌ర‌మైన ట్విస్టేమిటంటే అస‌లు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్న ఆ గ్రూప్ ఫోటో గెలిచిన త‌ర్వాత దిగిన‌ది కాదు. గెల‌వ‌క ముందే వీళ్లంతా మోదీని క‌లిసి విష్ చేశారు. గెలిస్తే ఎవ‌రైనా చేసేది ఇదే .. గెల‌వ‌క‌ముందు చేస్తేనే అది నిజ‌మైన అభిమానం అని ప్రూవైంది. అస‌లు గెల‌వ‌క‌పోయినా క‌లిసి అభినందించేవారే నిజ‌మైన అభిమానులు. అవునా .. కాదా?


Tags:    

Similar News