తన బయోపిక్ ‘ఆకాశం నీ హద్దురా’పై స్పందించిన కెప్టెన్ గోపీనాథ్

Update: 2020-11-13 15:10 GMT
తమిళ హీరో సూర్య ఎప్పుడు ఏ చిత్రం చేసినా అందులో కథకు ప్రాధాన్యత ఇస్తాడు. అందుకే ఆయన సినిమాల పట్ల తెలుగులోనూ బోలెడంతా ఫాలోయింగ్ ఉంది. తాజాగా సూర్య చేసిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఎయిర్ లైన్స్ సంస్థను స్థాపించడానికి సినిమాలో సూర్య పడ్డ కష్టం ప్రేక్షకులకు సైతం కన్నీళ్లు పెట్టించింది. ఈ రియల్ స్టోరీ ఆకట్టుకుంది. చాలా పోరాటం తర్వాత ఎయిర్ దక్కన్ ప్రారంభించిన కెప్టెన్ గోపీనాథ్ కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది.

కాగా తాజాగా తన కథను సినిమాగా తీసిన ఈ చిత్రాన్ని కెప్టెన్ గోపీనాథ్ చూశాడు. దీనిపై ఒక వివరణాత్మక సమీక్షను పోస్ట్ చేశాడు. అన్నింటికంటే మించి ఈ చిత్రం చాలా కల్పితమైనదని.. అయితే భావోద్వేగాలకు అనుగుణంగా బాగా తీశారని.. సూర్య, కథానాయిక అపర్ణ, బాలమురళి నటనలను ఆస్వాదించాడని గోపీనాథ్ చెప్పారు.

ఈ మేరకు కెప్టెన్ గోపినాథ్ ట్వీట్ చేశాడు. "సూర్య నటన శక్తివంతంగా సాగింది. కలలు నిజం చేసుకునేందుకు ఒక పిచ్చిగా ప్రయత్నించే మనిషి పాత్రలో జీవించేశాడు. దానికోసం తపనపడే ఒక వ్యవస్థాపకుడిలోకి ప్రవేశించి ఇందులో జీవించేశాడు.. ఈ చీకటి సమయాల్లో బయటకొచ్చిన అద్భుతమైన కథ ఇదీ.. గొప్ప ఉత్సాహభరితమైన కథ అనడంలో ఎలాంటి సందేహం లేదు ” అని గోపినాథ్ ఈ చిత్రాన్ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు.
Full ViewFull View
Tags:    

Similar News