ఈ టైంలో బతకలేం.. టీవీ నటుడి సూసైడ్
మహమ్మారి వ్యాపించి ప్రపంచమొత్తం బంధీ అయిపోయిన వేళ అందరికీ ఉద్యోగ ఉపాధి పోయి పస్తులుంటున్న పరిస్థితి నెలకొంది. నెల జీతాలు ఆగిపోయి కుటుంబం గడవక.. ఆదాయం వచ్చే మార్గాలు లేక జనాలు నరకయాతన పడుతున్నారు. ఇక మనకంటే సినిమా పరిశ్రమపై ఆధారపడి రంగుల లోకంలో విహరిస్తూ ఈ విషాదగీతం ఆలపిస్తున్న వారు ఈ పరిస్థితికి తట్టుకోలేకపోతున్నారు.
సినిమా షూటింగ్ లపైనే బతుకు సాగించే చిన్న స్థాయి ఆర్టిస్టులు.. ఇప్పుడు అన్నీ షూటింగ్ లు బంద్ కావడంతో కష్టాలను ఎదుర్కోలేకపోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధి కోల్పోయిన ఓ టీవీ నటుడు తాజాగా ఆత్మహత్యకు పాల్పడడం సినిమా పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది.
టీవీ నటుడు మన్మీత్ గ్రీవాల్ (32) తాజాగా ముంబైలోని తన నివాసంలో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్దిరోజులుగా షూటింగ్ లు ఆగిపోవడంతో ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నాడు. డబ్బులన్నీ అయిపోవడం.. అప్పు పుట్టకపోవడంతో నేవీ ముంబైలోని తన నివాసంలో తనువు చాలించాడు. ఫ్యాన్ కు వేళాడుతున్న మన్మీత్ ను చూసి ఆయన భార్య సృహతప్పి పడిపోయింది. లోన్లు చెల్లించలేక తీవ్రమైన ఒత్తిడికి గురై మన్మీత్ ప్రాణాలు తీసుకున్నట్టు స్నేహితులు తెలిపారు.
‘ఆదత్ సే మజ్బూర్ తోపాటు కుల్దీపక్ ’ వంటి షోలతో ఇతడు పాపులర్ అయ్యాడు. పంజాబ్ కు చెందిన మన్మీత్ కొన్ని వెబ్ సిరీస్ లు, కొన్ని సీరియళ్లులో పనిచేస్తున్నారు.