రైటర్ తొలి సినిమా.. రెగ్యులర్ గా ఉందే

Update: 2018-03-19 23:30 GMT
ఫస్ట్ లుక్ అందరిని ఆకట్టుకోవాలని సినిమా వాళ్లు ఎంతగా కష్టపడతారో తెలిసిందే. కానీ అన్నిసార్లు కష్టానికి తగిన ఫలితం దక్కకపోవచ్చు. ఫస్ట్ లుక్ కాకపోతే టీజర్ తో అయినా ఆకట్టుకోవాలని అనుకుంటారు. సినిమా టీజర్ కోసం అప్పుడపుడు కొన్ని ప్రత్యేకంగా సీన్స్ రెడీ చేసుకుంటారు. ఇకపోతే రీసెంట్ గా వస్తోన్న కొన్ని టీజర్స్ చాలా నిరాశపరుస్తున్నాయి. అంతా కొత్తగా ఏమి ఉండడం లేదు.

అసలు మ్యాటర్ లోకి వస్తే ఈ రోజు రచయిత శ్రీధర్ సీపాన దర్శకత్వం వహించిన మొదటి సినిమా బృందావనమది అందరిది టీజర్ రిలీజ్ అయ్యింది. రచయిత దర్శకుడిగా మారితే మొదటి లుక్ లోనే ఆకట్టుకున్నాడు అనేది ఒక మార్క్ కాన్ఫిడెన్స్. కానీ శ్రీధర్ మాత్రం నార్మల్ గా రెగ్యులర్ గా ఉంది అనిపించేలా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు శ్రీధర్ లౌక్యం - పూలరంగడు వంటి సినిమాలకు మంచి ఎంటర్టైనర్ గా ఉండే సినిమాలకు రైటర్ గా చేశాడు.

కానీ టీజర్ లో అతని రైటింగ్ స్కిల్స్ స్ట్రాంగ్ గా కనిపించడం లేదు.  హర్ష వర్ధన్ - రిచా పనయ్ ప్రధానపాత్రల్లో కనిపిస్తోన్న ఈ సినిమాలో డబ్బు కోసం ఆశపడే హీరోయిన్ ఇంట్లోకి రావడం తరువాత హీరో కలవడం.. హీరోయిన్ తో మరో అమ్మాయి.. డబ్బు కాన్సెప్ట్ అని చెప్పడం. ఇలా విభిన్న అంశాలు కనిపిస్తున్నా సినిమా ఒక యాంగిల్ ఏంటి? ఎందుకు చూడాలి? అనే ఆసక్తిని రప్పించడం లేదు. పైగా వర్మ gst ట్రాల్స్ ని సినిమాలో వాడేసుకున్నారు.మణిశర్మ సంగీతం ఇచ్చినట్లుగా అసలు అనిపించడం లేదు. మరి సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.  

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View

Tags:    

Similar News