మహేష్ మోషన్ పోస్టర్ కేక.. అంతే

Update: 2016-04-28 04:39 GMT
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన లేటెస్ట్ మూవీ బ్రహ్మోత్సవం పనుల్లో వేగం పెంచాడు. ఇప్పటివరకూ చాలా సార్లు ఆలస్యం అయిన ఈ మూవీపై.. ఇకపై ఎలాంటి లేట్ ఉండకూడదని డిసైడ్ అయిన మహేష్.. ఇప్పుడు తనే ఓ మోషన్ పోస్టర్ ని విడుదల చేశాడు. టీజర్ ఇచ్చాక పోస్టర్ ఏంటబ్బా అనుకున్న వాళ్లకి.. ఓ సమాధానం కూడా ఇచ్చాడు సూపర్ స్టార్.

మహేష్ బాబు తన ట్విట్టర్ పేజ్ లో మోషన్ పోస్టర్ ని లాంఛ్ చేశాడు. ఓ బ్రిడ్జ్.. దూరంగా కనిపిస్తున్న ఊరు.. ఆ బ్రిడ్జ్ పై నుంచి బైక్ తోలుతున్న మహేష్ బాబు. ఆ బైక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉందండోయ్. ఏకంగా మూడు టైర్లు పెట్టి.. బాగా పొడుగ్గా తయారు చేశారు. బైక్ పై మహేష్ వెనకాల ముగ్గురు హీరోయిన్లను కూడా ఎక్కించుకునేంత పెద్దగా బైక్ ని డిజైన్ చేశారు. బ్లూకలర్ షర్ట్, జీన్స్ ప్యాంట్ తో కళ్లజోడు పెట్టుకుని మహేష్ భలే అందంగా ఉన్నాడు ఈ మోషన్ పోస్టర్ లో.

చివర్లో మే 7న ఆడియో అంటూ చిన్న టెక్ట్స్ వేయడం చూస్తే.. ఈ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేయడంలో ఉద్దేశ్యం ఏంటో అర్ధమవుతుంది. మొత్తానికి ఈసారి మహేష్ బాబు స్వయంగా తనే ఆడియో విడుదల మే 7న విడుదల అన్నాడు కాబట్టి.. ఇకపై పోస్ట్ పోన్ లు ఉండకపోవచ్చు.
Full View

Tags:    

Similar News