బ్రహ్మీ మీటర్ లో మేటర్ తగ్గింది
బ్రహ్మానందం.. టైటిల్ కార్డ్స్ లో పేరు చూడగానే నవ్వుకునే రేంజ్ సాధించేశాడు. బ్రహ్మీ ఇంట్రడక్షన్ ను ముందుగానే జనాలు పసిగట్టేసి నవ్వుకునే స్థాయికి వచ్చాడంటే.. డైరెక్టర్లు ఈ నవ్వులరాజుపై ఎంతగా దృష్టి పెట్టారో అర్ధమవుతుంది. అయితే.. కొంతకాలంగా బ్రహ్మీకి బ్యాడ్ టైం నడుస్తోంది. కొత్తగా ఏం రావట్లేదు.. చేసినవేవీ పండడం లేదు. దీంతో బ్రహ్మీ పరిస్థితి బాగా బ్యాడ్ అయిపోయింది.
ముఖ్యంగా ఈ ఏడాది పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సాధారణంగా బ్రహ్మీ లేకుండా సినిమా చేయడమంటే రిస్క్ అనుకునేవాళ్లు నిర్మాతలు - దర్శకులు. ఈ ఏడాది బ్రహ్మనందం కనిపించిన సినిమాలు లెక్కట్టడానికి.. ఓ చేతికున్న వేళ్లు చాలు. అదేంటీ అనుకుంటున్నారా.. సన్నాఫ్ సత్యమూర్తి - పండగ చేస్కో - దోచెయ్ - దొంగాట - బ్రూస్ లీ.. ఈ ఐదు మూవీస్ లోనే బ్రహ్మానందాన్ని చూసే అవకాశం ప్రేక్షకులకు లభించింది.
సాధారణంగా బ్రహ్మీ కేరక్టర్ కి స్పెషల్ నేమ్ తగిలిస్తారు. ఆ ఏడాది ఆ పేరు బాగా ట్రెండ్ అయిపోతుంటుంది. అదంతా ఇప్పుడు గతంలా మారిపోయింది. ఈ ఏడాది ఏ సినిమాలోనూ తనదంటూ మార్క్ వేయలేకపోయాడు బ్రహ్మీ. చివరకు శ్రీనువైట్ల సినిమాల్లో కామెడీ ఇరగదీసే బ్రహ్మనందం.. పీటర్ అలియాస్ పకోడి కేరక్టర్ తో.. వాటర్ అలియాస్ నో మేటర్ అయినట్లుగా అయిపోయాడు. ఇప్పటికైతే సుకుమార్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ చేస్తున్న నాన్నకు ప్రేమతో మూవీలో చేస్తున్నాడు. దీంట్లో కూడా బ్రహ్మానందం కేరక్టర్ పండకపోతే.. కొత్త కమెడియన్లు పండగ చేసేస్కుంటారు.