హాస్య బ్రహ్మకి తీరని లోటు

Update: 2018-02-19 10:56 GMT
బ్రహ్మానందం - గుండు హనుమంతరావు - ధర్మవరపు సుబ్రహ్మణ్యం - ఎం.ఎస్.నారాయణ.. వీరందరిది ఒకటే కులం. అదే కామెడీ. వీరు చేసిన సినిమాలతో మనల్ని కడుపుబ్బా నవ్వించి మన మనసుల్లో సుస్థిర స్థానం కూడా సంపాదించుకున్నారు. ఎన్ని తరాలు మారినా వీరిని మించిన కమెడియన్స్ లేరు రారు కూడా.. వీళ్ళలో ఎవరు లేకపోయినా ఆ లోటు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎవరు తీర్చలేనిది.

ఎంత స్టార్ ఇమేజ్ ఉన్నా వీళ్లు నలుగురు ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడుతున్నట్టు కాకుండా చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. వీళ్ళ స్నేహం చూస్తే ఇండిస్ట్రీ లో ఎవరైనా కుల్లుకోవాల్సిందే. కానీ వాళ్ళల్లో ఒకళ్ళ తర్వాత ఒకరి మరణం బ్రహ్మానందాన్ని బాగా కలచివేసింది. మొదట 2013 లో ధర్మవరపు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. తర్వాత 2015 లో ఎం.ఎస్.నారాయణ మనల్ని విడిచి వెళ్లిపోయారు. ఇపుడు గుండు హనుమంత రావు కూడా 61 ఏళ్ల వయసులో హార్ట్ ఎటాక్ తో ఇవాళ ఉదయం మరణించారు. ఈ విషయం విన్న వినగానే తనలో ఎదో తెలియని అలజడి - వణుకు వచ్చాయని చెప్తున్నారు బ్రహ్మానందం.

హనుమంతరావు భౌతిక కాయాన్ని కడసారి చూసి వీడ్కోలు చెప్పడానికి వచ్చిన బ్రహ్మానందం కన్నీటి పర్యంతమయ్యారు. హనుమంతరావు కొడుకు ఆదిత్య ను హత్తుకుని బోరుమని విలపించారు. అతని ప్రియమిత్రులు అంత ఇలా తుదిశ్వాస విడుస్తూ ఉంటే బ్రహ్మానందం ఒంటరిగా విలపిస్తున్నారు. ఎప్పుడు నవ్వుల పువ్వులు కురిపించే బ్రహ్మానందం కంట్లో నీళ్లు చూస్తుంటే ఎవరికైనా కన్నీళ్లు ఉబికి వస్తాయి.
Tags:    

Similar News