'నా దృష్టిలో రిక్షావాడే గొప్పవాడు' అంటున్న హాస్య బ్రహ్మ

Update: 2020-04-26 02:30 GMT
టాలీవుడ్ హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఈరోజు డబ్బువిలువ గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు. డబ్బులు సంపాదించడమే కాదు దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో కూడా ఆయన అభిప్రాయం బయట పెట్టారు. డబ్బు విలువ ఏంటో తెలుసు కాబట్టే కష్టపడి డబ్బు సంపాదించానన్నారు. ఈ లాక్ డౌన్ నేపథ్యంలో ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న బ్రహ్మీ సామాన్యులు పడుతున్న కష్టాలపై స్పందిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా డబ్బు విషయంలో ఎందుకు స్ట్రిక్ట్ గా ఉండాలో చెప్పుకొచ్చారు. ‘జీవితంలో ఎన్నో విషయాలు ఉంటాయి. కొన్ని పక్కనపెడితే.. మన సినీ ఇండస్ట్రీలో డబ్బుని నెగ్లెట్ చేసిన వాళ్లు చాలామంది ఉన్నారు.

నేను చాలామంది నుంచి ఏం నేర్చుకోవాలో కాదు.. ఏం నేర్చుకోకూడదో అది తెలుసుకున్న.. డబ్బు విషయంలో నేను ఖచ్చితంగా లేకపోతే.. రోజుకి వంద రూపాయిలు ఇచ్చేవాడు.. పది రూపాయలే ఇస్తానంటే నా జీవితం ఏమవుతుందో ఆలోచించండి. ఇది కేవలం నేను డబ్బుకి రెస్పెక్ట్ ఇవ్వడం మాత్రమే. అలా డబ్బుకు విలువ ఇచ్చాను కాబట్టే నా చేతులతో 23మంది ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయించగలిగాను. నేను ఆ ఆడపిల్లలకు పెళ్లి చేయకపోతే.. వాళ్ల జీవితాలు ఏమయ్యేవి? ఆ బాధ్యతతోనే నేను వాళ్లకు పెళ్లి చేశాను. ఇవన్నీ చెప్పుకోవాల్సిన విషయాలు కాదు కాని.. అసలు వాళ్లకు ఇవ్వడానికి ఎవర్ని నేను.. గ్లోబు భగవంతుడు ఇస్తే అది అందరిదీ..

మనం ఒకడి చేతిలో పెట్టేస్తున్నాం.. ఆ ఒక్కడే మన దగ్గర నుంచి తీసుకుంటున్నాడు. అలాంటి వాడికి సహాయం, ధర్మం చేస్తున్నాం.. లాంటి పిచ్చి మాటలు మన డిక్షనరీలో ఉండొద్దు అనేదే తన అభిప్రాయం" అంటూ బ్రహ్మి తెలిపారు. కోటీశ్వరుడు నిద్ర లేకుండా గడుపుతుంటాడు.. రిక్షాతొక్కేవాడు హాయిగా ప్రశాంతంగా నిద్రపోతాడు. నా అభిప్రాయంలో ఆ రిక్షాతొక్కేవాడే కోటీశ్వరుడు. డబ్బు అనేదే ప్రధానం కాదు’ అంటూ చెప్పుకొచ్చారు బ్రహ్మానందం. ఆయన మాటలు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Tags:    

Similar News