వృత్తి మార్చిన బోయ‌పాటి?

Update: 2019-03-03 16:50 GMT
మాస్ మ‌సాలా యాక్ష‌న్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను - రామ్ చ‌ర‌ణ్ కాంబినేషన్‌ లో వ‌చ్చిన `విన‌య విధేయ రామ‌` డిజాస్ట‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. త‌లో రూ.5కోట్లు చొప్పున ద‌ర్శ‌క‌హీరోలు, నిర్మాత‌ తిరిగి పంపిణీదారుల‌కు వెన‌క్కి ఇవ్వాల్సి వ‌చ్చింద‌ని ప్ర‌చార‌మైంది. బోయ‌పాటి వేవ్ లెంగ్త్ కి చ‌ర‌ణ్ సింక్ అవ్వలేక‌పోవ‌డం .. యాక్ష‌న్ లో అతి - క‌థ పేల‌వంగా ఉండ‌డం వంటివి ఈ సినిమా ప‌రాజ‌యానికి కార‌ణాలు అని క్రిటిక్స్ విమ‌ర్శించారు. కార‌ణం ఏదైనా బోయ‌పాటి తీవ్రంగా విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. ఆ డిజాస్ట‌ర్ త‌ర్వాత‌ ప్ర‌స్తుతం బోయ‌పాటి ఏం చేస్తున్నారు? అంటే స‌రైన ఆన్స‌ర్ లేదు.

న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ‌తో బోయ‌పాటి సినిమా చేస్తున్నార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. ఈ సినిమా స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంద‌ని ప్ర‌చార‌మైంది. అయితే ఇది నిజ‌మా క‌దా? అన్న‌ది అటుంచితే.. బోయ‌పాటి ప్ర‌స్తుతం వేరొక ఇంపార్టెంట్ వ‌ర్క్ లో ఉన్నారు. ఏపీలో ఎన్నిక‌ల హీట్ అంతకంత‌కు రాజుకుపోతున్న వేళ అత‌డు తెలుగు దేశం పార్టీకి ప్ర‌క‌ట‌న‌లు రూపొందించే ప‌నిలో బిజీగా ఉన్నాడ‌ని తెలుస్తోంది.

తొలి నుంచి బాల‌య్య‌తో బోయ‌పాటికి ఎంత బాగా సింక్ అయ్యిందో.. అంత‌కుమించి ఏపీ సీఎం చంద్ర‌బాబుతోనూ బోయ‌పాటికి అంతే బాగా సింక్ కుదిరింది. అందుకే ప్ర‌తిసారీ ఎల‌క్ష‌న్ వ‌స్తే బోయ‌పాటిని పిలిచి ప్ర‌క‌ట‌న‌లు రూపొందించాల్సిందిగా ప్యాకేజీ అప్ప‌జెబుతుంటారు. బోయ‌పాటి అంటే అంత న‌మ్మ‌కం. తెదేపా ప్ర‌క‌ట‌న అంటే పార్టీ గౌర‌వ మ‌ర్యాద‌ల్ని పెంచేలా ప్ర‌క‌ట‌న ఉండాలి. అందుకు కాన్సెప్ట్ అంతే ఇంట్రెస్టింగ్ గానూ కుద‌రాలి. దానికోసం స్క్రిప్ట్ ప‌రంగా చాలానే క‌స‌ర‌త్తు చేస్తున్నాడ‌ట బోయ‌పాటి. ప్ర‌స్తుతం యాడ్ మేకింగ్ కోసం అమ‌రావ‌తిలోనే తిష్ఠ వేసాడ‌ట‌. కేవ‌లం బోయ‌పాటి మాత్ర‌మే కాదు అల్ల‌రి ర‌విబాబు సైతం తెదేపా ప్ర‌క‌ట‌న‌ల కోసం ప‌ని చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఓవ‌రాల్ గా బోయ‌పాటి ఈ యాడ్ క్యాంపెయినింగ్ వ్య‌వ‌హారాన్ని హ్యాండిల్ చేస్తున్నాడు. ఇంత శ్ర‌మిస్తున్నాడు కాబ‌ట్టి పార్టీ గెలిస్తే బోయ‌పాటికి అదిరిపోయే తాయిలాన్ని ఆఫ‌ర్ చేశార‌ట చంద్ర‌బాబు. ఇంత‌కీ ఏమా తాయిలం అంటే..? ఏదైనా ప‌ద‌వి క‌ట్ట‌బెడ‌తాన‌ని చెవిలో గుస‌గుస‌లాడార‌ట‌.
Tags:    

Similar News