• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ కళ్యాణ్ - అజిత్...

పవన్ కళ్యాణ్ - అజిత్ సినిమాల అప్డేట్స్ పై క్లారిటీ ఇచ్చిన బోనీకపూర్

By - Tupaki Desk
Update: 2020-05-01 08:15 GMT
ప్ర‌స్తుతం త‌మిళ స్టార్ హీరోల‌లో త‌లా అజిత్ కుమార్ ఒక‌రు. ఆల్ ఓవర్ ఇండియా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అజిత్ మే 1న 49వ ఏటలోకి అడుగుపెట్టబోతున్నాడు. అజిత్ బ‌ర్త్‌ డే సంద‌ర్భంగా అభిమానులు సోష‌ల్ మీడియాలో శుభ‌కాంక్ష‌ల వెల్లువ కురిపిస్తున్నారు. మ‌రోవైపు అజిత్ న‌టిస్తున్న 'వ‌లిమై' చిత్రానికి సంబంధించి ఏదో ఒక స‌ర్‌ ప్రైజ్ ఉంటుంద‌ని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నిర్మిస్తుండగా హెచ్‌. వినోత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అజిత్ స‌ర‌స‌న హ్యుమా ఖురేషీ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ చిత్రానికి యువ‌న్ శంక‌ర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నారు. కరోనా కారణంగా ప్రస్తుతం చిత్రీకరణ ఆగిపోయింది. అలాగే బోనీకపూర్ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజుతో కలిసి పవన్ కళ్యాణ్‌ తో 'పింక్' రీమేక్ 'వకీల్ సాబ్' చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం కరోనా సమస్యతో ప్రజలంతా ఇబ్బంది పడుతుండటంతో తన నిర్మాణంలోని సినిమాకు సంబంధించిన ఎలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించేది లేదని నిర్మాత బోనీ కపూర్‌ పేర్కొన్నారు. దీనికి సంబందించిన ప్రకటనను తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల చేసాడు.

''యావత్ ప్రపంచం కోవిడ్ -19 తో పోరాడుతోంది. మా బేవ్యూ ప్రాజెక్ట్స్ కి సంబంధించిన నటీనటులు మరియు సాంకేతిక వర్గం కూడా దానితో పోరాడాలని.. ఈ క్లిష్ట సమయాన్ని అధిగమించేంతవరకు మా సినిమాలకు సంభందించి ఎటువంటి ప్రజా సంబంధిత (PR) పనులు లేదా ప్రచారం చేయకూడదని పరస్పరం నిర్ణయించుకున్నాం. అందరం కలిసి ఈ యుద్ధంలో పోరాడుదాం" అంటూ బోనీకపూర్ బేవ్యూ ప్రాజెక్ట్స్ తరపున ప్రకటన విడుదల చేసారు. దీంతో 'వ‌లిమై' చిత్ర ఫ‌స్ట్ లుక్ లేదా టీజ‌ర్ వ‌స్తుంద‌నుకున్న అభిమానుల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లారు నిర్మాత బోనీ క‌పూర్. అంతేకాకుండా పవర్ స్టార్ నటిస్తున్న 'వకీల్ సాబ్' సినిమాకి సంబంధించి అప్డేట్ కూడా కరోనా క్రైసిస్ పోయే వరకు వచ్చే అవకాశం లేదని అర్థమైపోయింది. మరోవైపు కరోనా కారణంగా అజిత్ తన బర్త్ డే సెలెబ్రేషన్స్ రద్దు చేసుకున్నాడు. తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించరాదని అజిత్‌ అభిమానులకు సూచించారు.
Tags:    
  • Bonikapoor 
  • Pawan Kalyan 
  • Ajith 
  • Tollywood 
  • Tolllywood Latest Movie Updates 
  • Tollywood News 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

ధనుష్ స్టోరీ సెలెక్షన్ మారిపోతుందా?

2026-11-21 09:59 GMT

ఇడుపు కాయితం.. ఈసారి పందిట్లో పల్లెటూరి పెళ్లి పాట

2026-11-21 09:53 GMT

వ‌య‌సు ఒక నంబ‌ర్ మాత్ర‌మే.. శ్రీ‌య ది గ్రేట్!

2026-11-21 09:52 GMT

గ్యాప్ తర్వాత కమ్‌బ్యాక్ & కొత్త దర్శకుల నిరీక్షణ!

2026-11-21 09:51 GMT

ఏఐ విజువల్స్ పై రాంగోపాల్ వర్మ అదిరిపోయే కౌంటర్!

2026-11-21 08:39 GMT

అంచనాలను మించి ENE Repeat వసూళ్లు.. వీకెండ్‌లో మరింత జోరు!

2026-11-21 08:39 GMT

ఈ ఇయర్ టాప్ లో నిలిచిన హీరో అతనే...

2026-11-21 08:38 GMT

నవంబర్ 27 బాక్సాఫీస్ పోరు: భోగి vs మైసా!

2026-11-21 08:35 GMT

మళ్లీ మొదటికొచ్చిన చరణ్!

2026-11-21 08:35 GMT

సమంత కొడుకు పేరు వెనుక కథ ఏమిటి?

2026-11-21 08:35 GMT

పాత్ర కాదు పాత్ర‌లో డెప్త్ కావాలంటోన్న యువ భామ‌లు!

2026-11-21 08:35 GMT

పుస్తకం పై కవర్ చూసి జడ్జ్ చేయొద్దు!

2026-11-21 07:30 GMT

Copyright @2026

Powered by Blink CMS