బాలీవుడ్‌ కు వెళ్లబోతున్న సూపర్‌ హిట్‌ ఓటీటీ మూవీ

Update: 2020-11-16 10:50 GMT
తమిళ స్టార్‌ హీరో సూర్య నటించిన సూరారై పోట్రూ ఇటీవలే ఓటీటీలో విడుదలై సూపర్‌ హిట్‌ టాక్‌ ను దక్కించుకుంది. ఈ సినిమా థియేటర్లలో విడుదల అయితే ఖచ్చితంగా వంద కోట్లను వసూళ్లు చేసిది అంటూ ప్రేక్షకులు మరియు విశ్లేషకులు నమ్మకంగా చెబుతున్నారు. సుధ కొంగర దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. ఒక లైఫ్‌ స్టోరీని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ తో చూపించడం నిజంగా చాలా గొప్ప విషయం అంటూ యూనిట్‌ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్‌ సమయంలో హిందీలో రీమేక్‌ విషయమై ఆలోచిస్తున్నట్లుగా సూర్య పేర్కొన్నాడు. ఈ సినిమాకు సూర్య నిర్మాత అవ్వడం వల్ల ఇప్పుడు ఆయన నిర్ణయం ఏంటా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయనే హిందీలో నటిస్తాడేమో అంటూ కొందరు అనుకున్నారు. కాని హిందీ యంగ్‌ స్టార్‌ హీరోను ఈ సినిమా కోసం ఎంపిక చేసే విషయమై పరిశీలిస్తున్నారట. షాహిద్‌ కపూర్‌ ముఖ్య పాత్రలో సూరారై పోట్రూ రీమేక్‌ తెరకెక్కే అవకాశం ఉంది అంటూ తమిళ సినీ వర్గాల్లో మరియు మీడియా సర్కిల్స్‌ లో ప్రచారం జరుగుతోంది.

హిందీలో రీమేక్‌ చేస్తే అక్కడ కూడా సుధ కొంగర దర్శకత్వం వహించే అవకాశం ఎక్కువగా ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. తమిళం మరియు తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది కనుక ఖచ్చితంగా హిందీలో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక త్వరగా అక్కడ రీమేక్‌ పనులు మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయనిపిస్తుంది.
Tags:    

Similar News