సేతుపతి తర్వాత అంతగా ఆఫర్లు కొట్టేస్తున్న తంబీ
ప్రతిభావంతులు ఏ భాషకు చెందిన వారైనా టాలీవుడ్ లో పట్టంగడుతున్నారు. అలా ఎందరో ఇరుగు పొరుగు నటులు తెలుగు సినిమాల్లో అవకాశాలు చేజిక్కించుకున్నారు. ఇటీవల `జిగర్తాండ`కు ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్న ప్రముఖ తమిళ హీరో బాబీ సింహా.. రవితేజ `డిస్కో రాజా`తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత బన్ని పుష్పలో బాబి సింహా అవకాశం అందుకున్నారని కథనాలొచ్చాయి. కొన్ని నెలల క్రితం విజయ్ సేతుపతి స్థానంలో ఆయనను సంప్రదించినట్లు పుకార్లు వచ్చాయి.
ఇప్పుడు బాబీ సింహా తన తదుపరి తెలుగు సినిమాకు సంతకం చేశారు. హీరో సందీప్ కిషన్ త్వరలో ప్రారంభించబోయే కామెడీ ఎంటర్ టైనర్లో ఆయన ప్రధాన విలన్ గా నటించనున్నాడు. హీరో - విలన్ మధ్య హై-వోల్టేజ్ మైండ్ గేమ్ నేపథ్యంలోని యాక్షన్ సినిమా ఇదని తెలుస్తోంది.
ఈ చిత్రానికి జి నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. కోన వెంకట్- ఎంవివి సత్యనారాయణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సందీప్ కిషన్ సరసన నేహా శెట్టి కథానాయికగా నటిస్తోంది.