• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ట్రైలర్ టాక్: మోసగాడి...

ట్రైలర్ టాక్: మోసగాడి విశ్వరూపం

By - Tupaki Desk
Update: 2018-12-08 07:38 GMT
సత్యదేవ్ హీరోగా గోపి గణేష్ దర్శకత్వంలో రూపొందిన బ్లఫ్ మాస్టర్ ట్రైలర్ విడుదలైంది. తమిళ్ బ్లాక్ బస్టర్ సతురంగ వెట్టై రీమేక్ గా రూపొందిన ఈ మూవీలో నందిని శ్వేత హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకుని అమాయకులైన ప్రజలను మోసం చేయడం ద్వారా ఈజీ మనీకి అలవాటు పడిన యువకుడి కథే ఈ బ్లఫ్ మాస్టర్. కథానాయకుడి పాత్ర తీరుతెన్నులను ట్రైలర్లోనే చూపించి ఆసక్తి రేపారు. మీ ఖాతాలో ఉన్న బాలన్స్ బ్యాంకు అకౌంట్ నెంబరంత మారిపోతుంది అని చెప్పించడం ద్వారా హీరో పాత్ర ఎన్ని మాయ మాటలు చెబుతుందో అర్థమైపోతుంది.

ఇంత డబ్బు ఏం చేసుకుంటావ్ అని అడిగిన పోలీస్ ఆఫీసర్ తో అన్నింటికీ డబ్బే మూలం అని చెప్పించడం కూడా థీమ్ ని స్పష్టంగా చూపిస్తోంది. సత్యదేవ్ చాలా కాలం తర్వాత ఎక్కువ స్పాన్ ఉన్న పాత్రను దక్కించుకున్నాడు. హీరో పాత్రను డిజైన్ చేసిన స్వభావానికి తగ్గట్టే తన బాడీ లాంగ్వేజ్ ని కూడా  బాగా చూపించాడు. హీరోయిన్ నందిత శ్వేతను ఎక్కువగా చూపలేదు. సునీల్ కశ్యప్ బ్యాక్ గ్రౌండ్ సినిమా మూడ్ ని చక్కగా క్యారీ చేసింది. దాశరధి కెమెరా పనితనం కూడా బాగుంది.

మొత్తానికి క్రైమ్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే వాళ్లకు బ్లఫ్ మాస్టర్ కనెక్ట్ అయ్యేలా ఉన్నాడు. తమిళ్ లో పెద్దగా పరిచయం లేని నటులతో తీస్తే తెలుగు వెర్షన్ లో మాత్రం సిజ్జు-బ్రహ్మాజీ-ఆదిత్య నందన్-30 ఇయర్స్ పృథ్వి ఇలా అందరిని తెలిసినవాళ్లనే పెట్టుకోవడం ప్లస్ గా కనిపిస్తోంది. డిసెంబర్ 28 విడుదల కానున్న బ్లఫ్ మాస్టర్ లో ఓ మోసగాడి జీవితాన్ని ఆవిష్కరించబోతున్నారు. కోడి మీద జాలి పడితే చికెన్ 65 ఎలా తినగలం అనే డైలాగ్ బాగా పేలింది.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View

Tags:    
  • Satya Dev 
  • Nanditha Swetha 
  • Bluff Master Trailer 
  • Bluff Master Movie Trailer 
  • Satya Dev Bluff Master Trailer 

Similar News

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

పిల్లి కళ్ల భామకు వరుస అవకాశాలు..!

2026-11-03 17:54 GMT

ఈ ఒక్క వారం ఏకంగా 24 చిత్రాలు ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎప్పుడు?ఎక్కడంటే?

2026-11-03 17:53 GMT

RC 17: నాన్నకు ప్రేమతో కాదు.. ఈసారి అమ్మకు ప్రేమతో..!

2026-11-03 17:51 GMT

దేవుడి కీర్తనను రాజకీయం చేస్తారా ?

2026-11-03 17:50 GMT

Copyright @2026

Powered by Blink CMS