విజయ్ దేవకొండ ఒక సీమటపాకాయ్!

Update: 2022-01-18 23:30 GMT
విజయ్ దేవరకొండ యాక్టింగ్ సంగతి అలా ఉంచితే ఆయన యాటిట్యూడ్ కి చాలామంది అభిమానులైపోయారు. తాను బయట ఎలా ఉంటాడో తెరపై అలాగే కనిపిస్తాడు. తెరపై ఎలా అనిపిస్తాడో బయట కూడా అలాగే కనిపిస్తాడు. కొంత అమాయకత్వం .. మరికొంత ఆవేశం .. అవసరమైతే తెగింపు .. ఇవన్నీ కూడా ఆయనలోను .. ఆయన పాత్రల్లోను కనిపిస్తూ ఉంటాయి. అందువల్లనే విజయ్ దేవరకొండను .. ఆయన పోషించిన పాత్రలను ప్రేక్షకులు వేరు చేసి చూడలేకపోయారు. అందుకే వాళ్లంతా ఆయనకి అంతగా కనెక్టయిపోయారు.

సాధారణంగా శుక్రవారం రోజున తమ సినిమాలు విడుదలవుతుందంటే ఏ హీరో అయినా ఎంతో కొంత టెన్షన్ పడతాడు. కానీ విజయ్ దేవరకొండ లైట్ తీసుకుంటాడు. ఆ తరువాత సినిమాపై దృష్టిపెట్టేసి అటువైపు వెళ్లిపోతాడు. హిట్ కొట్టామనే విషయాన్ని స్టేజ్ పై ఎంత గట్టిగా చెప్పగలడో .. ఫ్లాప్ పడింది బై అని కూడా అంతే బలంగా చెప్పగలగడమే విజయ్ దేవరకొండ ప్రత్యేకత. దానినే అంతా ఇష్టపడుతుంటారు. ఒక్కోసారి ఆయనని చూస్తే అప్పుడప్పుడు ఆవేశం కూడా అవసరమే అనిపిస్తుంది.

అందువల్లనే ఆయన సీమటపాకాయ్ వంటివాడని బిగ్ బాస్ ఫేమ్ 'దివి' చెప్పుకొచ్చింది. తాజా ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నలకి సమాధానంగా  ఆమె ఈ అభిప్రాయాన్ని చెప్పింది. ఆయన సినిమాలు రిలీజ్ రోజున ఒక రేంజ్ లో పేలుతుంటాయి. 'ఏం సినిమారా .. ఏం చేశాడ్రా' అనుకుంటూ థియేటర్లలో నుంచి జనాలు వెళుతుంటారు. ఆయన నటన ఒక ఎత్తయితే .. ఆయన వాయిస్ .. ఆయన స్లాంగ్ .. ఆయన బిహేవియర్ ఒక ఎత్తు. మన హైదరాబాద్ కుర్రాడిలా అనిపిస్తూనే, యాటిట్యూడ్ తో ఆకట్టుకుంటాడు" అని చెప్పుకొచ్చింది.

"ఇక కంగనాను చూస్తే నాకు ఏకే 47 గుర్తుకు వస్తుంది. ఆమె మాట్లాడే మాటలు ఒక్కొక్కటి బుల్లెట్ ల మాదిరిగా తగులుతూ ఉంటాయి. ఏకే 47 తో షూట్ చేస్తున్నట్టుగానే మాట్లాడే ఆమె యాటిట్యూడ్ అంటే నాకు చాలా ఇష్టం. అనుష్కను చూస్తే 'ఫ్లవర్ పాట్' గుర్తుకు వస్తుంది. ఆమె కళ్లు .. ఆమె అభినయం అంటే నాకు చాలా ఇష్టం. ఆమె ఒక ఫ్లవర్ .. ఆమె పెర్ఫార్మెన్స్ చేస్తే అది ఫ్లవర్ పాట్" అంటూ చెప్పుకొచ్చింది.
Tags:    

Similar News