సైలెంట్ గా పెళ్లాడి స‌డెన్ షాకిచ్చిన కింగ్ హీరోయిన్

Update: 2020-11-22 04:15 GMT
గత నెలలో న‌ట‌న‌ను విర‌మించి షోబిజ్ నుంచి వైదొలగాలని తన నిర్ణయాన్ని ప్రకటించిన బిగ్ బాస్ 6 (హిందీ) ఫేమ్ సనా ఖాన్ స‌డెన్ పెళ్లితో షాకిచ్చారు. నిన్న రాత్రి సూరత్ లో ముఫ్తీ అనాస్ ని ముస్లిమ్ సాంప్ర‌దాయంలో వివాహ‌మాడారు.

ఈ పెళ్లికి సంబంధించిన అనేక వీడియోలు ఆన్ లైన్ ‌లో వైర‌ల్ గా మారాయి. అందులో ఆమె తన భర్తతో కలిసి తెల్లటి వివాహ గౌనులో క‌నిపించింది. తెలుపు సాంప్రదాయ దుస్తుల్లో స‌నా ఖాన్ ఎంతో ఆనందంగా క‌నిపిస్తున్నారు.

ఒక వీడియో క్లిప్ ‌లో ఇద్దరూ ఒక‌రి చేతిలో ఒక‌రు చెయ్యి వేసి ప్రేమ‌పూర్వ‌కంగా కనిపించారు. మరొకటి.. ఇరువురు తమ కుటుంబాల సమక్షంలో వారి వెడ్డింగ్ కేక్ ను కత్తిరిస్తున్నారు. ఫోటోలు .. వీడియోల  చూస్తే.., పెళ్లి ఒక ప్రైవేట్ వ్యవహారం అని తెలుస్తోంది.

నిజానికి ఈ పెళ్లికి ముందు స‌నా ఓ వివాదంతో ప్ర‌ముఖంగా వార్త‌ల్లోకొచ్చారు. ఈ సంవత్సరం ప్రారంభంలో... కొరియోగ్రాఫర్ మెల్విన్ లూయిస్ నుంచి విడిపోయినందుకు సనా వార్తల్లో నిలిచింది. గృహ హింసకు గురి చేసి త‌న‌ను మోసం చేసినట్లు స‌నా అత‌డిపై ప‌దే ప‌దే ఆరోపించింది. సనా తన బాధలను ప‌లుమార్లు బహిరంగపరిచింది. మెల్విన్ కు వ్యతిరేకంగా అనేక వాట్సాప్ స్క్రీన్ షాట్ ‌లను పంచుకుంది.

సనా ఖాన్ షోబిజ్ కు వీడ్కోలు పలికి సేవ‌కు సిద్ధ‌మ‌వుతుండ‌డం ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తావిస్తోంది. తాను రాసిన సుదీర్ఘ నోట్ లో ‘నేను మానవత్వానికి సేవ చేయాలని నిర్ణయించుకున్నాను’ అని రాశారు. గత నెలలో అకస్మాత్తుగా జరిగిన సంఘటనతో స‌నా షోబిజ్ నుండి విర‌మించిన‌ట్టు ప్రకటించింది. మానవత్వానికి సేవ చేయడానికి ఆమె సంకల్పించినట్లు పేర్కొంది. త‌న సుదీర్ఘ నోట్ లో “నా సంతోషకరమైన క్షణం... ఈ ప్రయాణంలో నాకు మార్గనిర్దేశం చేయడానికి అల్లాహ్ నాకు సహాయం చేస్తాడు. ఆప్ సాబ్ ముజే దువా మై షామిల్ రాఖే ” అంటూ ఎమోష‌న్ కి గుర‌య్యారు. క‌ష్టంలో ఉన్న‌వారిని ఆదుకునేందుకే ఈ నిర్ణ‌యం అని స‌నా ప్ర‌క‌టించింది. స‌నా ఖాన్ సౌత్ లోనూ ప‌లు చిత్రాల్లో న‌టించింది. కింగ్ నాగార్జున న‌టించిన ప‌య‌నం (గ‌గ‌నం) లో స‌నా ఓ కీల‌క పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News