నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 4 ముగిసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం చివరిలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ఫైనల్ విజేతను ప్రకటించడమే గాక ప్రైజ్ మనీని ట్రోఫీని అందజేసే ఘట్టం ఎమోషనల్ గా సాగడమే గాక.. ప్రీక్లైమాక్స్ ఎమోషన్ మరింతగా రక్తి కట్టించిందనే చెప్పాలి.
ముఖ్యంగా ముగ్గురు ఫైనలిస్టుల నడుమ మెలోడ్రామా ఆద్యంతం రక్తి కట్టించింది. చివరిగా అరియానా.. హారిక లను ఎలిమినేట్ చేయగా మిగిలిన ముగ్గురిలో సోహైల్-అఖిల్- అభిజీత్ నడుమ బోలెడంత హైడ్రామా నడిచింది.
ఈ షో విన్ అయితే 50లక్షల క్యాష్ ప్రైజ్ అందుతుందన్న సంగతి తెలిసిందే. అయితే 25లక్షల సూట్ కేస్ ఊరిస్తుండగా సడెన్ గా సోహైల్ పోటీ నుంచి నిష్క్రమించాడు. అతడి తీరుకు విమర్శలు వస్తాయనుకుంటే.. క్లాప్స్ పడ్డాయి. అతడి నిర్ణయాన్ని ఎవరూ తప్పు పట్టలేదు సరికదా.. అదే సరైన నిర్ణయం అని పొగిడేశారంతా. సోహైల్ కి 25లక్షల సూట్ కేస్ అందుకుని అందులోంచి 10లక్షలు అనాధ పిల్లల సాయానికి ప్రకటించి మనసు దోచాడు. అలాగే తన ఫ్రెండు కోపార్టిసిపెంట్ మెహబూబ్ కి ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు సాయమందిస్తున్నానని ప్రకటించి ఇంకా ఆకట్టుకున్నాడు. చివరికి సోహైల్ కి మిగిలినది 10లక్షలే. కానీ ఇక్కడే అసలు ట్విస్టు మరింత రంజింపజేసింది.
ఈ ప్రోగ్రామ్ మొత్తానికి హైలైట్ గా నిలిచిన ఎలిమెంట్ ఏమిటంటే అనాధలకు తాను ఇస్తానన్న మొత్తాన్ని హోస్ట్ నాగార్జున టేకోవర్ చేసి తానే ఆ 10లక్షల మొత్తాన్ని ఇస్తానని ఈ కష్టార్జితాన్ని సోహైల్ మాత్రమే సేవింగ్ చేసుకోవాలని కోరారు. ఇక ఈవెంట్ చివరిలో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి సైతం సోహైల్ అండ్ ఫ్రెండ్ మెహబూబ్ కి 10లక్షల సాయం ప్రకటించి షాకిచ్చారు. అంటే నాగార్జున 10లక్షలు.. చిరు 10లక్షలు కలుపుకుని సోహైల్ అండ్ ఫ్రెండ్స్ కే 45లక్షలు దక్కినట్టు. ఓవరాల్ గా సోహైల్ కి ఇచ్చిన మొత్తం 45 లక్షలు అనే చెప్పాలి.
చివరిగా సూట్ కేస్ లోని 25లక్షలు సోహైల్ కి ఇవ్వడానికి అంగీకరించి సీజన్ విన్నర్ అయిన అభిజీత్ మంచి మనసు చాటుకున్నాడు. అంటే పాతిక లక్షలు వదులుకున్న అతడికి దక్కింది కేవలం 25లక్షల ప్రైజ్ మనీ మాత్రమే. ట్రోఫీ కీర్తి అదనం. ఇక తనకు రెండో స్థానం దక్కిన అఖిల్ ఆ స్థాయికి రావడానికి అభిమానుల ఆదరణ చాలని సరిపెట్టుకున్నారు. అయితే సోహైల్ 25లక్షలతో నిష్క్రమించడానికి రన్నర్ అఖిల్ కానీ విజేత అయిన అభిజీత్ కానీ అంగీకరించకపోతే అతడు పోటీ నుంచి బయటకు వెళ్లే ఛాన్సే లేదు. కానీ ఆ ఇద్దరూ పెద్ద మనసుతో అంగీకరించడం గొప్ప కొసమెరుపు. ఇవన్నీ ఎపిసోడ్ మొత్తం గ్రాఫ్ ని స్కైలోకి తీసుకెళ్లాయనే చెప్పాలి.