బిగ్ అప్డేట్: సంక్రాంతికి #PSPKRana.. ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేసిన మేకింగ్ వీడియో..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి హీరోలుగా '#PSPKRana' వర్కింగ్ టైటిల్ తో ఓ మల్టీస్టారర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇది మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కొశీయున్' చిత్రాన్ని అధికారిక తెలుగు రీమేక్. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందిస్తున్నారు. సోమవారం ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. 'భీమ్లా నాయక్' అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కనిపించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియో రిలీజ్ చేస్తూ.. బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చారు.
ఇంకా టైటిల్ ఖరారు చేయని '#PSPKRana' చిత్రాన్ని 2022 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ఆఫీసియల్ గా ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోలో పవన్ పోలీస్ గెటప్ లో అలరిస్తున్నారు. ప్రత్యేకంగా వేసిన పోలీస్ స్టేషన్ సెట్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న కీలక సన్నివేశాల షూట్ లో రానా కూడా పాల్గొన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తుంది.
కాగా, ఈ చిత్రంలో పవన్ సరసన నిత్యామీనన్.. రానా కు జోడీగా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.12 గా ఈ ప్రాజెక్ట్ రూపొందుతోంది. నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా ప్రసాద్ మూరెళ్ళ స్థానంలో ఇప్పుడు రవి కె. చంద్రన్ జాయిన్ అయ్యారు. రాబోయే సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద భీమ్లా నాయక్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.
Full View